నాగరాజు హీరోగా నువ్వు తోపు రా ఫస్ట్ లుక్ ప్రోమో

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఫేమ్ నాగరాజు హీరోగా నువ్వు తోపు రా ఫస్ట్ లుక్ ప్రోమో

Last Updated : Jan 1, 2019, 01:51 PM IST
నాగరాజు హీరోగా నువ్వు తోపు రా ఫస్ట్ లుక్ ప్రోమో

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో నాగరాజు అనే యువకుడి పాత్రలో నటించడం ద్వారా వెండితెరకు పరిచయమైన యువనటుడు సుధాకర్ కోమాకుల హీరోగా మరో సినిమా తెరకెక్కుతోంది. నువ్వు తోపురా అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో సూరి అనే ఓ యువకుడి పాత్రలో సుధాకర్ కనిపించనున్నాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో నాగరాజుగా నటించిన సుధాకర్ కోమాకుల తన మాస్ డైలాగ్ డిక్షన్‌తో ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాడు. మొత్తంగా లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో ఆడియెన్స్‌కి గుర్తుండిపోయే పాత్రల్లో తనది ఒకటి అనేలా నాగరాజు పర్‌ఫామ్ చేశాడు. ఆ సినిమా చేసిన అనుభవంతోనే తాజాగా మరో సినిమా అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. హరినాధ్ బాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సుధాకర్ సరసన నిత్య శెట్టి జంటగా నటిస్తోంది. నూతన సంవత్సరం సందర్భంగా టాలీవుడ్ ఆడియెన్స్‌కు శుభాకాంక్షలు చెబుతూ తమ సినిమాకు సంబంధించిన ఓ చిన్న వీడియో ప్రోమోను నిర్మాతలు విడుదల చేశారు. 

Trending News