Oppo Reno8 Pro: ఒప్పో రెనో8 ప్రో 5జీ లాంచింగ్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.16500 తగ్గింపు...

Flipkart Oppo Reno8 Pro 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో కొత్త సిరీస్‌ను ఇండియన్ మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఇందులో ఒప్పో రెనో 8, ఒప్పో రెనో 8 ప్రో మోడల్స్ ఉన్నాయి.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 19, 2022, 06:24 PM IST
  • ఫ్లిప్‌కార్ట్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఆఫర్స్
  • ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో కొత్త సిరీస్ లాంచ్
  • ఒప్పో రెనో8 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపు
Oppo Reno8 Pro: ఒప్పో రెనో8 ప్రో 5జీ లాంచింగ్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.16500 తగ్గింపు...

Flipkart Oppo Reno8 Pro 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో కొత్త సిరీస్‌ను ఇండియన్ మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఇందులో ఒప్పో రెనో 8, ఒప్పో రెనో 8 ప్రో మోడల్స్ ఉన్నాయి. వీటిల్లో ఒప్పో రెనో 8 ప్రో 5జీ నేటి నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది. లాంచింగ్ ఆఫర్ కింద ఈ స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. అంతేకాదు, ఉచితంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఒప్పో రెనో8పై ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఆఫర్

ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఒప్పో రెనో8 5జీ స్మార్ట్ ఫోన్ (గ్లేజ్డ్ గ్రీన్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ) రూ.45,999కి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లయితే రూ.4 వేలు వరకు తగ్గింపు పొందవచ్చు. తద్వారా రూ.41,999కే ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్‌పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ కింద రూ.12,500 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది.  ఒకవేళ మీకు డిస్కౌంట్ ఆఫర్‌తో పాటు పూర్తి ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా వర్తించినట్లయితే.. మొత్తంగా రూ.16,500 వరకు తగ్గింపు పొందవచ్చు. అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్‌ని కేవలం రూ.29,499కే సొంతం చేసుకోవచ్చు.

డిస్నీ + హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ :

ఒప్పో రెనో8 ప్రో 5జీ లాంచింగ్ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ మరో ఆఫర్ కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేసే కస్టమర్స్‌కు ఉచితంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది.

OPPO రెనో8 ప్రో 5G ఫీచర్స్ :

మీడియాటెక్ డైమెన్సిటీ 8100 Max ప్రాసెసర్‌
12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌
6.7 అంగుళాల Full HD డిస్‌ప్లే
4500mAh బ్యాటరీ సామర్థ్యం
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ - 50MP ప్రైమరీ సెన్సార్, 8MP సెకండ్ 2MP థర్డ్ సెన్సార్, 32MP ఫ్రంట్ కెమెరా

Also Read: Amazon Offers: రూ.15 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ డెడ్‌ చీప్‌గా రూ.999కే.. ఆఫర్ ఈ ఒక్కరోజే

Also Read: TS EAMCET-2022: ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన..ఎంసెట్ అగ్రికల్చర్ రీషెడ్యూల్ ఇదే..!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News