హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్ 37.40 డాలర్లకు పడిపోయినప్పటికీ దేశీయ చమురు సంస్థలు పెట్రో, డీజీల్ ధరలను పెంచుతూనే ఉన్నాయి. వరుసగా ఇదో రోజు పెట్రో ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా ఈ రోజు లీటరు పెట్రోల్‌పై 57 పైసలు, డీజిల్‌పై 59 పైసలు పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.77.41కి, డీజిల్ ధర రూ.71.16కి చేరింది. ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రో ధరలు పెంచుతూ ఉండటంతో ఈ నెల రోజుల్లో పెట్రోల్ ధర రూ.3.31, డీజిల్ ధర రూ.3.42పైసలు పెరిగాయి.
Also Read: Green India Challengeను స్వీకరించిన ప్రభాస్..
దీంతో దేశంలో ఇంధన రేట్లు ప్రస్తుతం నాలుగున్నర నెలల గరిష్ట స్థాయికి చేరాయి. గత నెలలో కేంద్రప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.13 ఎక్సైజ్ సుంకం పెంచింది. అయితే దీని ప్రభావం వినియోగదారులపై నేరుగా పడలేదు. న్యూఢిల్లీ పెట్రోల్ రూ.74.57, డీజిల్ రూ.7.21. ముంబై- పెట్రోల్ రూ.81.53, డీజిల్ రూ.71.48. చెన్నై- పెట్రోల్ రూ.78.47, డీజిల్ రూ.71.14. బెంగళూరు- పెట్రోల్ రూ.76.98, డీజిల్ రూ.69.22
Also Read: Gandhi hospital: గాంధీలో కరోనా పేషెంట్ డెడ్‌బాడీ మిస్సింగ్