రాక్షసుడు టీజర్‌: పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సాయి శ్రీనివాస్

రాక్షసుడు టీజర్‌: పోలీస్ ఆఫీసర్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్

Last Updated : Jun 1, 2019, 09:33 PM IST
రాక్షసుడు టీజర్‌: పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సాయి శ్రీనివాస్

సీత సినిమాతో ఇటీవలే ఆడియెన్స్ ముందుకొచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్ర‌స్తుతం రాక్ష‌సుడు అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన రాచ్చసన్ అనే సినిమా ఆధారంగా తెలుగులో రీమేక్ అవుతున్న ఈ సినిమాను రైడ్, వీర చిత్రాల ఫేమ్ రమేష్‌ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. ఉగాది సంద‌ర్భంగా రాక్షసుడు ఫస్ట్ లుక్ విడుద‌ల చేసిన చిత్రయూనిట్ తాజాగా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రం సాయి శ్రీనివాస్ పోలీస్ ఆఫీస‌ర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

 

Trending News