#MeToo : మహిళలపై లైంగిక వేధింపులు.. స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్

#MeToo : మహిళలపై లైంగిక వేధింపులు.. స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్

Last Updated : Nov 3, 2018, 04:03 PM IST
#MeToo : మహిళలపై లైంగిక వేధింపులు.. స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్

సినీపరిశ్రమతో మొదలై, ఇతర రంగాలకు పాకిన మీటూ ఉద్యమం ఇప్పుడు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సంగతి తెలిసిందే. చివరకు ప్రముఖ సాంకేతిక దిగ్గజం గూగుల్ సంస్థ సైతం ఈ మీటూ ఉద్యమంపై స్పందించాల్సి వచ్చిందంటే, ఉద్యమం తీవ్రత ఏ రేంజ్‌లో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఈ మీటూ ఉద్యమంపై తాజాగా ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. తమకి అన్యాయం జరిగిందని, తమపై దాడి జరిగిందని గొంతెత్తున్న మహిళలకు తాను పూర్తి మద్దతు ఇస్తానని స్పష్టంచేశారు. కాకపోతే, చేస్తున్న ఆరోపణలకు ప్రామాణికత ఏంటన్నదానిపై కూడా ఆలోచించాల్సిన అవసరముందని రకుల్ ప్రీత్ సింగ్ అభిప్రాయపడింది. 

ఓ ప్రముఖ తెలుగు టీవీ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మీటూ ఉద్యమం గురించి మాట్లాడుతూ.. గతంలోనే తాను ఈ అంశంపై స్పందించానని, సినీ పరిశ్రమలో జరుగుతున్న మీటూ ఉద్యమంలోనూ అర్థం వుందని అన్నారామె.  

Trending News