ప్రణయ్ పరువు హత్యపై రాంగోపాల్ వర్మ హాట్ రియాక్షన్

                                                                            

Last Updated : Sep 21, 2018, 06:46 PM IST
ప్రణయ్ పరువు హత్యపై రాంగోపాల్ వర్మ హాట్ రియాక్షన్

మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువుహత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా ఇదే అంశం పై హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. దీనిపై రాజకీయ నేతలు, సినీనటులు స్పందిస్తున్నారు. ఈ హత్యను ఖండిస్తూ సోషల్ మీడియాలో పలువురు పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకూడా ఈ అంశంపై తనదైన శైలిలో స్పందించారు. ఈ పరువు హత్యపై తన ఫేస్ బుక్ లో కామెంట్ చేశారు

వర్మ కామెంట్ : అమృత తండ్రి మారుతీ రావు ఒక పిరికి పంద..క్రూరుడైన క్రిమినల్. ప్రణయ్‌ను హత్య చేసి తన పరువు తిరిగి పొందగలిగాడా.. ఒకవేళ అతను పరువుకోసమే హత్య చేసినట్టైతే.. అతను కూడా చావడానికి సిద్ధంగా ఉండాలి..నిజమైన పరువు హత్య అంటే పరువు కోసం హత్య చేసేవారిని హత్య చేయడమే  అంటూ వర్మ తనదైన శైలిలో స్పందించారు.

 

Trending News