close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

RRR టైటిల్ వెనుకున్న మతలబు ఇదేనా ?

RRR అంటే అర్థం ఇదేనా ?

Updated: Oct 6, 2019, 05:58 PM IST
RRR టైటిల్ వెనుకున్న మతలబు ఇదేనా ?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన ఎస్ఎస్ రాజ‌మౌళి తెరకెక్కిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం `RRR`. భారీ బ‌డ్జెట్‌‌కి తగినట్టుగానే ఈ సినిమాపై అంతకుమించిన భారీ అంచ‌నాల‌ున్నాయి. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికన్నా ముందుగానే RRR అనే టైటిల్‌ను రాజమౌళి తెరపైకి తీసుకొచ్చారు. తమ తర్వాతి ప్రాజెక్ట్ RRR అని మీడియాకు, అభిమానులకు పరిచయం చేసిన రాజమౌళి.. ఆ టైటిల్ వెనుకున్న రహస్యాన్ని మాత్రం విడమర్చి చెప్పలేదు. దీంతో ఎన్టీఆర్, రాంచరణ్ పోషించే పాత్రలకు అనుగుణంగా సినిమా టైటిల్‌పై అనేక పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. 

ఇదిలావుంటే, RRR టైటిల్ వెనుకున్న అసలు మతలబు ఇదేనంటూ తాజాగా మరో ప్రచారం తెరపైకొచ్చింది. 'రామ‌ రౌద్ర రుషితం' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని, అలాగే ఇత‌ర భాష‌ల్లో 'రైజ్ రివోల్ట్ రివేంజ్‌' అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నార‌నేది టాక్‌ సారాంశం. అంతేకాకుండా దీనిపై త్వరలోనే ఓ ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. వ‌చ్చే ఏడాది జూలై 30న ఆడియెన్స్ ముందుకు రానున్న ఆర్ఆర్ఆర్ గురించి మరిన్ని విషయాలు తెలియాంటే.. చిత్ర యూనిట్ నుంచి ఓ అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచిచూడాల్సిందే.