బాలీవుడ్ హీరోకి ప్రభాస్ సర్‌ప్రైజ్..!

టాలీవుడ్ నటుడు ప్రభాస్ ఓ బాలీవుడ్ హీరోని ఆశ్చర్యంతో ముంచెత్తారు. తనతో పాటు "సాహో" చిత్రంలో నటిస్తున్న నీల్ నితిన్ ముఖేష్‌కి ఆయన అనుకోని సర్‌ప్రైజ్ ఇచ్చారు. 

Last Updated : May 4, 2018, 05:28 PM IST
బాలీవుడ్ హీరోకి ప్రభాస్ సర్‌ప్రైజ్..!

టాలీవుడ్ నటుడు ప్రభాస్ ఓ బాలీవుడ్ హీరోని ఆశ్చర్యంతో ముంచెత్తారు. తనతో పాటు "సాహో" చిత్రంలో నటిస్తున్న నీల్ నితిన్ ముఖేష్‌కి ఆయన అనుకోని సర్‌ప్రైజ్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం "సాహో" సినిమా టీమ్ షూటింగ్ నిమిత్తం అబుదబిలో ఉంది. అయితే అబుదబికి షూటింగ్‌కి వెళ్లకముందు ఎవరికీ తెలియకుండా ప్రభాస్ ఒక్కడే ముంబయి వెళ్లాడు.

తనతో పాటు  "సాహో"లో విలన్‌గా నటిస్తున్న నీల్ నితిన్ ముఖేష్ ఇంటికి వెళ్లి అతన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇంతకీ విషయం ఏమిటంటే... ఇటీవలే ముఖేష్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త వచ్చింది. అందుకే పర్సనల్‌గా వారిని కలిసి శుభాకాంక్షలు చెప్పాలని ప్రభాస్ భావించారట. అందుకే వారికి చెప్పకుండా వారి ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ చేశారట. అనుకోకుండా ప్రభాస్ తమ ఇంటికి రావడంతో ముఖేష్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయట. 

ఆ విషయాన్ని ముఖేష్ స్వయంగా చెబుతూ ప్రభాస్‌తో తన కుటుంబం పంచుకున్న మధుర క్షణాలను ఆయన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్టు చేశారు.  ఆ ఫోటోలతో పాటు ఆయన "సాహో" సెట్‌లో దర్శకుడు సుజీత్‌తో తీసుకున్న ఫోటోని కూడా పోస్టు చేశారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న "సాహో" చిత్రంలో ప్రభాస్‌తో పాటు శ్రద్దా కపూర్, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, మందిరా బేడి,మహేష్ మంజ్రేకర్, చుంకీ పాండే మొదలైన బాలీవుడ్ నటులు నటిస్తున్నారు.

వంశీ క్రిష్ణరెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హిందీలో గుల్షన్ కుమార్ సంస్థ టీసీరీస్ సమర్పిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

 

 

 

Trending News