Happy Makar Sankranthi greetings : సినీతారల నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి.. సౌతిండియాలో అతి పెద్ద పండగల్లో ముఖ్యమైనదిగా భావించే పండగ ఇది. కొత్తగా పంట చేతికొచ్చిన తరుణంలో సూర్య భగవానుడిని ఆరాధిస్తూ వేడుకగా జరుపుకునే ఈ సంక్రాంతిని మరింత సంబరాలమయం చేస్తూ సినీతారలు సైతం తమ అభిమానులు, ప్రజలు అందరికీ సంక్రాంతి పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు.

Last Updated : Jan 15, 2020, 10:00 PM IST
Happy Makar Sankranthi greetings : సినీతారల నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి.. సౌతిండియాలో అతి పెద్ద పండగల్లో ముఖ్యమైనదిగా భావించే పండగ ఇది. కొత్తగా పంట చేతికొచ్చిన తరుణంలో సూర్య భగవానుడిని ఆరాధిస్తూ వేడుకగా జరుపుకునే ఈ సంక్రాంతిని మరింత సంబరాలమయం చేస్తూ సినీతారలు సైతం తమ అభిమానులు, ప్రజలు అందరికీ సంక్రాంతి పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో తనతో పాటు రాంచరణ్, అల్లు అర్జున్, సాయధరమ్ తేజ్, అల్లు శిరీష్ కలగలిసిన ఓ ఫోటోను షేర్ చేసుకున్న వరుణ్ తేజ్.. అందరికీ హ్యాపీ సంక్రాంతి అంటూ శుభాకాంక్షలు చెప్పాడు.

కాజల్ అగర్వాల్ సైతం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఓ ఫోటోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అందరికీ హ్యాపీ పొంగల్, సంక్రాంతి, లోహ్రి, బిహు అంటూ వేర్వేరు ప్రాంతాల్లో వారికి వేర్వేరు పేర్లతో శుభాకాంక్షలు చెప్పింది. అమ్మడు చెప్పిన విషెస్ ట్వీట్‌కి అభిమానుల నుంచి మంచి స్పందన కనిపించింది.

తెలుగు సినిమాల్లో తళుక్కుమంటున్న ఉత్తరాది బ్యూటీ రాశి ఖన్నా కూడా తనదైన స్టైల్లో.. నిండైన చీర కట్టులో ఉన్న ఫోటో పోస్ట్ చేసి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పింది. అమ్మడి స్టైల్ ఏంటో మాటలతో చెప్పడం కంటే, ఆమె విషెస్ చెబుతూ పోస్ట్ చేసిన ఫోటోలోనే చూసేద్దాం.

చైతూని పెళ్లి చేసుకుని అక్కినేని వారింటికి కోడలుగా అడుగుపెట్టిన సమంత అక్కినేని కూడా అందరికీ తనదైన స్టైల్లో అందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలతో ఓ ట్వీట్ చేశారు.

Trending News