Sapta Sagaralu Dhaati Trailer: నాని చేతుల మీదుగా ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ట్రైలర్ విడుదల..

Sapta Sagaralu Dhaati Trailer: కన్నడ సూపర్‌ హిట్‌ అయిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ మూవీ త్వరలోనే తెలుగులో విడుదల కాబోతోంది. అయితే చిత్ర బృదం ఈ సినిమాను  ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 19, 2023, 05:56 PM IST
Sapta Sagaralu Dhaati Trailer: నాని చేతుల మీదుగా ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ట్రైలర్ విడుదల..

 

Sapta Sagaralu Dhaati Trailer: కన్నడలో ఘన విజయం సాధించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ చిత్రాన్ని ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. 777 చార్లీతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ రూపొందిచిన మూవీ ‘సప్త సాగర దాచే ఎల్లో’ కోలీవుడ్‌లో బంఫర్‌ హిట్‌ అయ్యింది. దర్శకుడు హేమంత్ ఎం రావు నిర్మించిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించారు. సెప్టెంబర్ 1న కోలీవుడ్‌లో విడుదలై క్లాసిక్ లవ్ స్టోరీగా మంచి పేరు పొందంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను బృందం ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్ తో సెప్టెంబర్ 22న టాలీవుడ్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. 

ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనలో భాగంగా హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో పాట బి.వి.ఎస్.రవి పాల్గొన్నారు. నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. ఇంతక ముందే "చార్లీ సినిమా సమయంలో రక్షిత్‌ని కలిశాను. వారికి సినిమాలంటే అంటే చాలా ఇష్టం..కాబట్టి ఇలాంటి సినిమాలు తీసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు.  టీజర్, ట్రైలర్ నేను చూశాను ద్భుతంగా ఉన్నాయి. ఎప్పుడు ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీయాలనుకోవడం అభినందించదగ్గ  విషయం..ఈ సినిమా తెలుగులో విడుదలవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది." అన్నారు. 

ఈ సందర్భంగా రచయిత BVF రవి మాట్లాడుతూ.." ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి  ఫోన్ చేసింది.. ఇది ఆసక్తికరమైన మూవీ, అర్జెంట్‌గా చూడమన్నారు. నేను ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు అడిగితే..కనీసం ట్రైలర్ కూడా చూడకుండా వెళ్ళమని చెప్పడం నాకు ఆసక్తి కలిగించింది. దీంతో నేను ఏ మాత్ర వేయిట్‌ చేయ్యకుండా ఈ సినిమాని కన్నడ వెర్షన్‌లో చూశాను. ఈ సినిమా ప్రపంచం..దీని గురించి మాట్లడడానికి మాటలు సరిపోవు..ఇది ప్రమ కథ అనాలో, జీవిత కథ అనాలో..మాటలు వెతుక్కోవాల్సిందే. ఒక్క చిన్న రిస్క్‌ వల్ల ఎన్ని జీవితాలు ప్రభావితమవుతారో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమాలో ప్రతి షాట్‌లో నాకు కథ కనిపించింది. ఒక షాట్‌ మిస్‌ అయిన పూర్తి కథ మిస్‌ అవుతాం అని అనిపించింది. ఇక ఈ మూవీలో పార్ట్‌ టూ ఉందని గ్లింప్స్ చూపించారు.  గ్లింప్స్ లో ఇంకా కథ మరింత ఆసక్తిగా ఉంటుంది. 

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

ఈ సినిమాపై రక్షిత్ శెట్టి మాట్లాడుతూ.. "సప్త సాగర దాచే ఎల్లో మూవీని ఇంతక ముందు కన్నడలో రిలీజ్‌ చేశాం..ఈ సినిమా చూసిన చాలా మంది పాన్‌ ఇండియాలో విడుదల చేయలేదని అడిగారు. కొన్ని మూవీస్‌ను మనం తీసుకుపోకపోయి..వాటంతటకవే వెళ్తాయి. ఈ సినిమాను మేము అంతా 100 శాతం నమ్మాం..హీరోయిన్ రుక్మిణీ వసంత్ సినిమా కోసం ఎంతో కష్టపడతారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు చాలా నచ్చుతుందని ఆశిస్తున్నాను" అన్నారు.

ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని సోషల్‌ మీడియా ద్వారా నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. అంతేకాకుండా చిత్ర బృందానికి ఆయన తరుఫున శుభాకాంక్షలు తెలిపారు. కన్నడలో మంచి పేరు తెచ్చుకున్న ఈ సినిమా తెలుగులోనూ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. 

✾ చిత్రం : సప్త సాగరాలు దాటి 
✾ నటీనటులు : రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ 
✾ రచన–దర్శకత్వం : హేమంత్ ఎం రావు
✾ బ్యానర్ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 
✾ నిర్మాతలు: రక్షిత్ శెట్టి, టీజీ విశ్వ ప్రసాద్ 
✾ సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFaceboo

Trending News