షకీలా బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల..!

దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో కొన్నాళ్లు అడల్ట్ చిత్రాలలో నటించి.. ఆ తర్వాత పలు చిత్రాలలో సహాయ పాత్రలలో కూడా రాణించిన నటి షకీలా.

Last Updated : Nov 20, 2018, 01:48 PM IST
షకీలా బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల..!

దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో కొన్నాళ్లు అడల్ట్ చిత్రాలలో నటించి.. ఆ తర్వాత పలు చిత్రాలలో సహాయ పాత్రలలో కూడా రాణించిన నటి షకీలా. తేజ దర్శకత్వం వహించిన జయం, జై చిత్రాలలో షకీలా నటించిన సంగతి తెలిసిందే.  అలాగే "రొమాంటిక్ టార్గెట్" పేరుతో వచ్చిన ఓ చిత్రానికి దర్శకత్వం కూడా వహించిందామె. ఇప్పుడు ఆమె బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టరును ఈ రోజు విడుదల చేశారు నిర్మాతలు. "షకీలా" టైటిల్‌తో విడుదల అవుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టి రిచా చ‌ద్దా షకీలా పాత్రని పోషిస్తోంది.

ఇంద్రజిత్ లోకేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాజిక్‌ సినిమా ప్రొడక్షన్స్‌ నిర్మాణ సారధ్యం వహిస్తున్న ఈ చిత్రంలో షకీలా కూడా ఓ ప్రధాన పాత్రను పోషిస్తున్నారట. 2019 సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు‌తో పాటు హిందీ, మలయాళం, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. గతంలో సిల్క్ స్మిత బయోపిక్‌ను బాలీవుడ్‌లో ""డర్టీ పిక్చర్" పేరుతో విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

గుంటూరులో జన్మించిన షకీలా అసలు పేరు షకీలా బేగం. ఆమె తల్లి తెలుగు వ్యక్తి కాగా.. తండ్రి తమిళుడు. చిన్నప్పటి నుండీ ఆమెకు నటన అంటే ఇష్టం. సినీ రంగంలోకి రావాలనే ఆలోచనతో ఆమె తన చదువును పక్కన పెట్టేశారు. బీ గ్రేడ్ సినిమాలలో నటించడానికి కూడా ఆమె సంకోచించలేదు. మలయాళంలో ఆమె నటించిన అనేక చిత్రాలకు సెన్సార్ కత్తెర పడింది. అలాగే పలు చిత్రాలు వివాదాస్పదమయ్యాయి. అయినా ఆమెకున్న క్రేజ్ తగ్గలేదు. 2003 నుండి షకీలా అడల్ట్ చిత్రాలలో నటించడం మానేశారు. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో కామెడీని పండించే హాస్య పాత్రలలో నటించసాగారు. 

Trending News