'అల' దర్శకులతో బన్నీ పార్టీ

చాలా కాలం తర్వాత అల వైకుంఠపురం సినిమాతో సక్సెస్ సాధించిన అల్లు అర్జున్ తన సంతోషాన్ని చిత్ర యూనిట్ తో పంచుకున్నాడు. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, ఇప్పటికే చిత్ర యూనిట్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా 

Last Updated : Feb 3, 2020, 11:23 PM IST
'అల'  దర్శకులతో బన్నీ పార్టీ

హైదరాబాద్ : చాలా కాలం తర్వాత అల వైకుంఠపురం సినిమాతో సక్సెస్ సాధించిన అల్లు అర్జున్ తన సంతోషాన్ని చిత్ర యూనిట్ తో పంచుకున్నాడు. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, ఇప్పటికే చిత్ర యూనిట్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్‌ ప్రముఖుల కోసం బన్నీ ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీ ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టాలీవుడ్ తనకంటూ  ఓ ప్రత్యేకత ఉన్న బన్నీ చిత విజయం తో ఉబ్బి తబ్బి అవుతున్నాడు. 

 

మరోవైపు టాలీవుడ్‌ ప్రముఖ దర్శకులందరితో దిగిన ఫోటో వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉంటే త్రివిక్రమ్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన అల వైకుంఠపురంలో చిత్రం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల జోరు కనబరుస్తోంది. కాగా ఈ చిత్రం ఇప్పటికే 150 కోట్ల షేర్‌కుచేరువైనట్లు తెలుస్తోంది. తాజాగా మరో ప్రముఖ సంచలన దర్శకుడితో సోషియో ఫాంటసీ చిత్రానికి బన్నీ అంగీకారం తెలిపినట్టు సమాచారం.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News