ఇంతకాలం మురగునపడ్డ టాలీవుడ్ డ్రగ్స్ కేసులు మళ్లీ తెరపైకి వచ్చాయి. డ్రగ్స్ కేసును విచారణ జరిపిన ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)... దీనికి సబంధించి మొత్తం 12 కేసులు నమోదు చేసింది. ఇందులో నాలుగు కేసుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసింది. మరో 8 కేసుల్లో ఛార్జిషీట్ ను సిట్ దాఖలు చేయాల్సి ఉంది. తాజాగా నమోదు చేసిన ఛార్జ్ షీట్లలో సినీ సెలబ్రిటీల పేర్లు లేకపోవడం గమనార్హం.
సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరోలు, హీరోయిన్స్, దర్శకులలతో సహా మొత్తం 62 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అప్పట్లో వీరి నుంచి గోళ్లు, కేశముల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పంపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎవరి పేర్లు బయటపడాయనేది ఆసక్తికరంగా మారింది.
ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభ రెడ్డి సమాచారం హక్కు చట్టం కింద టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ వివరాలు కోరారు. దీనిపై స్పందించిన ఎక్సైజ్‌శాఖ సంబంధిత ఈ మేరకు సమాచారాన్ని తెలియజేసింది.