Telangana Assembly: అసెంబ్లీలో హరీష్ సెటైర్లు.. సభలో నవ్వులే నవ్వులు..

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు  పునః ప్రారంభం అయ్యాయి.   ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే.. ఇటీవల మృతి చెంది మాజీ ఎమ్మెల్యేలకు సభ సంతాపం తెలపింది. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం  ప్రారంభమైంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత హరీష్ రావు అసెంబ్లీ వేదిక ప్రభుత్వాన్ని నిలదీసారు. ముఖ్యంగా గత కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న సర్పంచ్ బిల్లుల చెల్లింపుపై  ప్రభుత్వాన్ని నిలదీసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 16, 2024, 12:23 PM IST
 Telangana Assembly: అసెంబ్లీలో హరీష్ సెటైర్లు.. సభలో నవ్వులే నవ్వులు..

Telangana Assembly Sessions:అంతేకాదు రూ.690 కోట్లు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని మంత్రి సీతక్క అసెంబ్లీ వేదికగా చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో బడా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తోన్న ప్రభుత్వం.. సర్పంచుల చెల్లించాల్సిన బిల్లుల విషయంలో శీతకన్ను వేసిందన్నారు. గత యేడాది కాలంగా రూ. 690 కోట్ల ఇవ్వకుండా సర్పంచులు. ఎంపీటీసీ గోస ఈ ప్రభుత్వానికి చుట్టుకుంటుందన్నారు. అంతేకాదు బిల్లులు చెల్లించాలని సర్పంచులు గవర్నర్ ను కలిసారు. అంతేకాదు మంత్రులను కలిసి మొరపెట్టుకున్న వారి వేదన అరణ్య రోదనే అయిందన్నారు. తమ న్యాయంగా రావాల్సిన బకాయిలను అడిగినందుకు ఎక్కడిక్కడ వారిని అరెస్ట్ చేయడం శోచనీయమన్నారు.

మరోవైపు కేసీఆర్, పల్లెలకు అద్భుతంగా తీర్చిదిద్దారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి గొప్ప కార్యక్రమాలు అమలు చేసిన విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. అంతేకాదు పల్లె ప్రగతికి ప్రతి నెల రూ. 275 కోట్లు.. పట్టణ ప్రగతి  కోసం రూ. 150 కోట్ల తమ ప్రభుత్వ హయాములో సర్పంచులకు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత యేడాది కాలంలో ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఒక్క పైసా విదల్చలేదు. కేంద్ర ప్రభుత్వ చెబుతున్న లెక్కలు. దేశవ్యాప్తంగా ఉత్తమ గ్రామ పంచాయతీలు ప్రకటిస్తే 20 కిగాను 19 తెలంగాణ గ్రామాలకు వచ్చిన విషయాన్ని గుర్తు చేసారు.

మొత్తంగా తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత గత ముఖ్యమంత్రి కెసిఆర్ తోపాటు బి ఆర్ ఎస్  పార్టీకి దక్కుతుందన్నారు.
కాంగ్రెస్  ప్రభుత్వం వచ్చాక SFC నిధులు విడుదల కావడం లేదు,  15 ఫైనాన్స్ కమిషన్ బిల్లులు పక్క దారి పట్టించారు.
జిపి ఫండ్ కూడా ఖర్చు పెట్టుకోకుండా చేశారు. మొత్తంగా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కల్పించారు.

గ్రామాల్లో అభివృద్ది పను కోసం సర్పంచులు అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టి గ్రామ పంచాయతీ పనులు చేశారు. అయినా వారికి సంబంధించిన బకాయిలు ఒక్కటి చెల్లించలేదన్నారు. మరోవైపు నవంబర్ ఒక్క నెలలోనే బడా బడా కాంట్రాక్టర్లకు రూ. 1200 కోట్లు విడుదల చేశారు. చిన్న పనులు చేసిన సర్పంచులు ఎంపీటీసీలు జడ్పిటిసి లకు బిల్లులు విడుదల చేయకుండా పగ బట్టారన్నారు. మొత్తంగా సర్పంచులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు దిగిందనే విషయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు.  గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయక పోవడం వల్ల గ్రామాల్లో  రోగాలు పెరిగాయి.

తెలంగాణకు పోతే చికెన్ గున్యా ఉంది. వెళ్ళకండి జాగ్రత్త అని అమెరికా హెచ్చరించిన దుస్థితి ఏర్పడింది.
ఇది దేశానికి మరియు తెలంగాణకు అవమానం.సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లకు 9 నెలలు అయినా జీతాలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదు. జీతాలు సంగతి సరేసరి. అప్పులు కట్టలేక వారు చాలా బాధల్లో ఉన్నారు. ఇప్పటికైనా బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టమైన తేదీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మొత్తంగా ఈ నెల 9న మొదలైన సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. కాగా  సమావేశాలు ఎప్పటి వరకు కొనసాగించాలన్నది ఈ రోజు జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు.

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News