ఇంటర్ పూర్తి చేయని లెజెండ్  సచిన్‌ కు విష్ చేసిన హీరో రామ్ !

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కు టాలీవుడ్ నటుడు రామ్ ఆసక్తికర రీతిలో ట్వీట్ చేశాడు

Updated: Apr 24, 2019, 08:31 PM IST
ఇంటర్ పూర్తి చేయని లెజెండ్  సచిన్‌ కు విష్ చేసిన హీరో రామ్ !

లెజెండరీ క్రికెటర్‌ సచిన్ బుధవారం తన 47వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వివిధ వేదికలపై ద్వారా శుభాంకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. ఈ  క్రమంలో టాలీవుడ్ హీరో రామ్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర రీతిలో విష్ చేశాడు

ఇంటర్‌ పూర్తి చేయని సచిన్‌కు హ్యాపీ బర్త్‌డే అంటూ హీరో రామ్ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. ‘పార్క్‌లో కూర్చుని బిస్కెట్లు తినే పిల్లలకి ఏదైనా చెబితే వింటారు. బెడ్‌రూమ్‌లో తాళం వేసుకుని జీవితం ఎలా రా? అనుకునే పిల్లలకి.. నిజాలు ఈ విధంగా చెబితేనే వింటారు. ఇంటర్‌ కూడా పూర్తి చేయని ది ప్రైడ్‌ ఆఫ్‌ నేషన్‌ సచిన్‌ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అని రామ్‌ ట్వీట్‌ చేశారు. 

తెలంగాణలో ఇంటర్ పరీక్షల్లో మార్కులు రాలేదని ఆవేదనతో 17 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకొని రామ్ ఈ విధంగా ట్వీట్ చేశారు.  ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ తాను ఇంటర్ పూర్తి చేయలేదని బాంబు పేల్చాడు