టాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ కన్నుమూత

సీనియర్ సినీ నటుడు వినోద్(59) హైదరాబాద్‌లో కన్నుమూశారు.

Last Updated : Jul 15, 2018, 05:27 PM IST
టాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ కన్నుమూత

సీనియర్ సినీ నటుడు వినోద్(59) హైదరాబాద్‌లో కన్నుమూశారు. హీరోగా ప్రస్థానం మొదలుపెట్టి.. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటించిన ఆయన బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన అసలు పేరు అరిశెట్టి నాగేశ్వరరావు. ఆయన స్వస్థలం తెనాలి.

దాదాపు 300కు పైగా సినిమాల్లో వినోద్ నటించారు. 1980లో వి.విశ్వేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన కీర్తి కాంత కనకం ఆయన మొదటి చిత్రం. ఈ సినిమాలో వినోద్ హీరోగా నటించారు. తర్వాత చంటి సినిమాతో బాగా ఫేమసై.. లారీ డ్రైవర్, ఇంద్ర వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Trending News