అలనాటి తార వాణిశ్రీ కుమారుడు మృతి..!!

టాలీవుడ్ సీనియర్ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కుమారుడు డాక్టర్ అభినయ వేంకటేశ కార్తీక్ .. గుండెపోటుతో హాఠాన్మరణం చెందారు.

Last Updated : May 23, 2020, 01:56 PM IST
అలనాటి తార వాణిశ్రీ కుమారుడు మృతి..!!

టాలీవుడ్ సీనియర్ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కుమారుడు డాక్టర్ అభినయ వేంకటేశ కార్తీక్ .. గుండెపోటుతో హాఠాన్మరణం చెందారు.

నిన్న అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆయన నిద్రలోనే కన్నుమూశారు. చైన్నైలోని వాణిశ్రీ స్వగృహంలో  కార్తీక్ చనిపోయారు. అభినయ వెంకటేశ కార్తీక్ వైద్య విద్యను పూర్తి చేశారు. చెన్నైలోని రామచంద్రన్ కాలేజీలో ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన వయసు 36  సంవత్సరాలు. ఆయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. ఆయన భార్య కూడా వైద్యురాలే కావడం విశేషం. 

కార్తీక్ అంత్యక్రియలు ఇవాళ (శనివారం) సాయంత్రం చెన్నైలో జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. మరోవైపు కార్తీక్ మృతి కాస్త అనుమాస్పదంగా ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అటు టాలీవుడ్ ప్రముఖులు వాణిశ్రీ కుమారుడి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News