తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిపాలైన సీనియర్ నటి !

ప్రస్తుతం బెంగుళూరులో వుంటోన్న జయంతి గత కొంత కాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.

Last Updated : Mar 27, 2018, 04:22 PM IST
తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిపాలైన సీనియర్ నటి !

సీనియర్ నటి జయంతి తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిపాలయ్యారు. సినిమాలు పూర్తిగా మానేసిన తర్వాత బెంగుళూరుకి మకాం మార్చిన జయంతి గత కొంత కాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జయంతి ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ అస్వస్థతకు గురి కావడంతో మొదట ఆమెను సిటీ ఆస్పత్రిలో చేర్పించిన కుటుంబసభ్యులు ఆ తర్వాత అక్కడి నుంచి విక్రమ్ హాస్పిటల్స్‌కి తరలించినట్టు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెప్పినట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దక్షిణాదిన తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ భాషలతోపాటు మరాఠి భాషా చిత్రాల్లోనూ కలిపి సుమారు 500లకుపైగా చిత్రాల్లో జయంతి నటించారు.

సినిమాలు చేసిన అన్ని భాషల్లోనూ ఎంజీఆర్, రాజ్ కుమార్ లాంటి సమకాలీకులైన అగ్ర హీరోల సరసన హీరోయిన్‌గా నటించారు. 1960-70ల అనంతరం హీరోయిన్‌గా సినిమాలు చేయడం మానేసిన తర్వాత ఆ తర్వాతి తరం స్టార్ హీరోలకి తల్లి పాత్రలు పోషించి మెప్పించారామె. 

Trending News