రానా.. మహేష్ బాబు తర్వాత.. ఇప్పుడు ముఖ్యమంత్రి పాత్రలో విజయ్ దేవరకొండ?

లీడర్ చిత్రంలో నటుడు రానా ముఖ్యమంత్రి పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబు కూడా సీఎం పాత్రలో అభిమానులకు కనువిందు చేశారు. ఇప్పుడు అదే పాత్రలో మరో నటుడు కూడా నటించబోతున్నారట. 

Updated: Jul 13, 2018, 05:21 PM IST
రానా.. మహేష్ బాబు తర్వాత.. ఇప్పుడు ముఖ్యమంత్రి పాత్రలో విజయ్ దేవరకొండ?

లీడర్ చిత్రంలో నటుడు రానా ముఖ్యమంత్రి పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబు కూడా సీఎం పాత్రలో అభిమానులకు కనువిందు చేశారు. ఇప్పుడు అదే పాత్రలో మరో నటుడు కూడా నటించబోతున్నారట. అవును.. నటుడు విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో వస్తున్న ఓ సినిమాలో ఆయన కూడా సీఎం పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

ఆ చిత్రానికి  ‘నోటా’ అనే టైటిల్ పెట్టారని.. నటి మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తోందనే వార్తలు వస్తున్నాయి. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై జ్ఞానవేల్‌ రాజా నిర్మించబోయే ఈ చిత్రం తమిళంలోనూ విడుదల కానుందని టాక్. ఇప్పటికే అర్జున్ రెడ్డి, పెళ్లిచూపులు, మహానటి చిత్రాలతో సక్సెస్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండతో సినిమాలు తీయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారని సమాచారం.

అయితే తొందరపడకుండా మంచి సబ్జెక్టులనే ఎంచుకోవాలని భావిస్తున్నాడట ఈ యువ హీరో. అందుకే ఆచి తూచి అడుగులు వేస్తున్నాడని తెలుస్తోంది. తాజాగా .‘గీత గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ చిత్రాల్లో కూడా విజయ్ దేవరకొండ నటిస్తున్నారు.