తెలంగాణలో పరిపాలనపై విజయ్ దేవరకొండ కామెంట్

తెలంగాణలో పరిపాలనపై విజయ్ దేవరకొండ కామెంట్

Last Updated : Sep 30, 2018, 08:50 PM IST
తెలంగాణలో పరిపాలనపై విజయ్ దేవరకొండ కామెంట్

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం స్టార్‌డమ్ అనుభవిస్తున్న విజయ్ దేవరకొండ తాజాగా తెలంగాణలో పరిపాలనపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన నోటా సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో తాజాగా అతడు ఓ న్యూస్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌తో ఎంతో చనువు ఉన్న విజయ్ దేవరకొండ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడా అని బయట ఓ ప్రచారం జరుగుతోంది కదా!! ఆ ప్రచారంపై కామెంట్ చేయాల్సిందిగా అడిగారు ఇంటర్వ్యూయర్. 

ఇంటర్వ్యూయర్ అడిగిన ఈ ప్రశ్నకు విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. ప్రస్తుతానికి మన రాష్ట్రంలో పరిపాలన సూపర్‌గా ఉంది. మన పరిపాలకులు సైతం మంచి లక్ష్యంతో, ముందు చూపుతో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం తనకు లేదు. తనతో రాజకీయాలకు అవసరం లేదు అని బదులిచ్చాడు. 

Trending News