close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

'సర్కార్' హైదరాబాద్‌కు రావడం లేదు

'సర్కార్' హైదరాబాద్‌కు రావడం లేదు

Updated: Oct 22, 2018, 10:58 PM IST
'సర్కార్' హైదరాబాద్‌కు రావడం లేదు
Teaser source : Youtube@SunTV

ప్రముఖ తమిళ సినీ హీరో ఇళయ దళపతి విజయ్‌ అప్‌కమింగ్ సినిమా సర్కార్ రిలీజ్‌కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఆ చిత్ర ప్రమోషన్స్ కోసం విజయ్ హైదరాబాద్‌కు వస్తున్నట్టు వస్తున్న వార్తలను అతడి పీఆర్ టీమ్ ఖండించింది. ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో తెలుగునాట మురుగకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఆ సినిమాను తెలుగులో కూడా రిలీజ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అక్టోబర్‌ 29న హైదరాబాద్‌లో ఓ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు, ఈ వేడుకకు విజయ్‌ హాజరుకానున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తాజాగా విజయ్‌ పీఆర్‌ టీమ్‌ ట్విటర్ ద్వారా స్పష్టంచేసింది. ఇలాంటి అవాస్తవ వార్తలను నమ్మవద్దంటూ సదరు టీమ్ విజయ్ అభిమానులకు విజ్ఞప్తిచేసింది. 

అభిమానులకు దీపావళి కానుకగా నవంబర్ 6న ఆడియెన్స్ ముందుకు రానున్న ఈ సినిమాలో విజయ్, కీర్తి సురేశ్‌ జంటగా నటించగా ఏ.ఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఇటీవలే రిలీజైన సర్కార్ సినిమా తమిళ టీజర్‌‌కు సైతం భారీ స్పందన కనిపిస్తోంది. రాజకీయాల నేపథ్యంతో తెరకెక్కిన సర్కార్ లో విజయ్ ఓ కార్పొరేట్‌ క్రిమినల్‌ పాత్రలో విజయ్‌ కనిపించనున్నాడని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. అశోక్‌ వల్లభనేని తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, రాధా రవి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.