White Tea Benefits: వైట్ టీ వలన కలిగే అద్భుత ప్రయోజనాలు..

సాధారణ టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీల గురించి మనం వైన్ ఉంటాము మరియు మనలో చాలా మందికి టీ తాగనిదే రోజు గడవదు కూడా. కానీ వైట్ టీ వలన కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే సాధారణ టీ తాగటం మానేసి వైట్ టీ మాత్రమే తాగుతారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 27, 2023, 07:48 PM IST
White Tea Benefits: వైట్ టీ వలన కలిగే అద్భుత ప్రయోజనాలు..

Weight Loss Tea: మనలో చాలా మంది పాలు, పంచదార, టీపొడి తో చేసే సాధారణ టీ, బ్లాక్ టీ మరియు గ్రీన్ టీ ని తాగే ఉంటారు. కానీ ఎప్పుడైనా వైట్ టీని ప్రయత్నించారా..? సాధారణంగా వైట్ తీ టీ గురించి చాలా మందికి అవగాహనా లేదు, మాట్లాడరు కూడా.. కానీ ఈ టీ వాళ్ళ కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వాడికి ఈ వైట్ టీ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా.. ముఖంపై కనపడే వృద్దాప్యాన్ని కనపడకుండా దోహదపడుతుంది. 

వైట్ టీతో లభించే పోషకాలు 
వైట్ టీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే వైట్ టీలో ఉండే యాంటీమైక్రోబయల్ గుణాలు.. అనేక వ్యాధుల నుండి రక్షణ కలిగిస్తుంది. ఇందులో పాలీఫెనాల్స్, ఫైటోన్యూట్రియెంట్స్ మరియు అనేక రకాల కాటెచిన్స్ ఉంటాయి. అంతే కాకుండా.. వైట్ టీలో టానిన్లు, ఫ్లోరైడ్ మరియు ఫ్లేవనాయిడ్లు కూడా ఉన్నాయి. 

వైట్ టీ తాగడం వల్ల కలిగే లాభాలు 

  • వైట్ టీ తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే..?
  • సాధారణంగా మనలో చాలా మంది శరీర బరువు తగ్గించుకోటానికి గ్రీన్ టీ ని తాగుతూ ఉంటారు. కానీ మీరు గనుక ఒకసారి వైట్ టీని 
  • ట్రై చేయండి. ఈ టీ తాగితే అసలు ఆకలి వేయదు.. ఆహరం తక్కువ తీసుకోవటం వలన శరీర బరువు తగ్గుతుంది. 
  • వైట్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించి.. ఆరోగ్యానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ లేదా ఫారెన్ పార్టికల్స్ ను నియంత్రిస్తుంది. 
  • వైట్ టీలో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు చర్మం పై ఉండే మచ్చలను, ముడతలను మరియు ఫైన్ లైన్స్ ని తగ్గించడంలో సహాయపడతాయి.  
  • ముఖంపై చర్మం వేలాడుతూ.. వృద్దాప్య చర్మం ఉన్నవారు ఈ వైట్ టీ తాగితే యవ్వనంగా కనిపిస్తారు.  
  • ఒకవేళ ఉదయం ఈ వైట్ టీ తాగితే.. రోజు అంతా తాజాగా.. ఎనర్జిటిక్ గా ఉంటారు.  

Also Read: IND Vs AUS Dream11 Team Today Prediction: వరల్డ్‌కప్‌కు ముందు చివరి ఫైట్.. భారత్ వైట్‌వాష్ చేస్తుందా..? డ్రీమ్11 టీమ్, పిచ్ రిపోర్ట్ ఇలా..  

  • వైట్ టీ తాగటం వలన రిఫ్రెష్ అవుతారు మరియు అలసట కూడా తగ్గుతుంది. 
  • వైట్ టీ తాగే అలవాటు ఉన్నవారు తీపి పదార్థాలు తినటానికి ఇష్టపడరు. ఫలితంగా స్వీట్స్ వలన కలిగే ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు. 
  • అజీర్ణం సమస్యలతో బాధపడేవారికి వైట్ టీ ఒక దివ్యౌషధం అనే చెప్పాలి. వైట్ టీ మలబద్ధకం మరియు గ్యాస్‌ను దూరం చేయడంలో సహాయపడుతుంది. 
  • వైట్ టీలో పాలీఫెనాల్స్ జ్ఞాపకశక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. 
  • వైట్ టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్ లను దూరం చేస్తుంది. 
  • రక్తంలో చెడు కొలెస్ట్రాల్ సమస్య కలవారు తప్పనిసరిగా ఈ వైట్ టీని తాగాలి.  
  • వైట్ టీ తాగటం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గటం వలన హై బీపీ, మధుమేహం, గుండెపోటు సమస్యలు కలిగే ప్రమాదం తగ్గుతుంది.

Also Read: Most Expensive Currency: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కరెన్సీ ఏదో తెలుసా..! డాలర్ కంటే చాలా ఎక్కువ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x