చిన్నారులపై ఆస్తమా ప్రతాపం..

Last Updated : Sep 7, 2017, 05:45 PM IST
చిన్నారులపై ఆస్తమా ప్రతాపం..

మన దేశంలో ఆస్తమా రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం భారత దేశంలో 1.5 కోట్ల ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నట్లు  తేలింది. ప్రధానంగా చిన్నారుల్లో అస్తమా ఎఫెక్ట్ ఎక్కువగా కనిపించడం ఆందోళన కలిగించే అంశం. అస్తమా వ్యాధి వ్యాప్తికి గాలి కాలుష్యమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. గాలి కాలుష్యానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ మన ఇళ్లల్లో వాడే కిరోసిన్, కట్టెల పొయ్యి వాడకం కూడా కారణమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ తాజా అధ్యయనం ప్రకారం భారత దేశంలో 70 శాతం కంటే అధికం మంది కిరోసిన్ , కట్టెల పొయ్యి వాడుతున్నారని.. వీటి నుంచి వచ్చే కార్భన్ వావువులతో పాటు అనేక వ్యర్థ వాయివులు మన శ్వాసకోశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తేలింది. ఇది ప్రధానంగా చిన్నారులపై ఎక్కవగా ప్రభావం చూపుతున్నట్లు తేలింది. 

దీనిపై ఎయిమ్స్ డైరెక్టర్ అగర్వాల్ మాట్లాడుతూ ..సహజంగా చిన్నార్లుల్లో శ్వాసకోశాలు చిన్నవిగాను..సున్నితంగా ఉండటం  వల్ల కర్భన వాయివులు శ్వాసకోశాలపై ప్రభావం చూపి వాపును కల్గిస్తున్నాయి. దీని కారణంగా వాయువునాళాలు కుదించుకుపోవడానికి దోహదం చేస్తోంది. ఫలితంగా  చిన్నారులు అస్తమా బారిన పడుతున్నారు. దీన్ని తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుందంటున్నారు ఎయిమ్స్ డైరెక్టర్ అగర్వాల్.

గుర్తించడం ఎలా..?

ఒకప్పుడు అస్తమా వంశాన్ని బట్టి ముందు తరాల వారికి ఎక్కువగా వచ్చేదనీ.. ఇప్పుడు అలాంటి వారికంటే.. గాలి కాలుష్యంతోనే ఎక్కువగా వస్తుందంటున్నారు డాక్టర్లు. అస్తమా అంటే.. శ్వాస కోశాలకు వచ్చే అలర్జీ. గాలి పీల్చుకునే గొట్టాలు చిన్నగా అయ్యి.. దగ్గు, ఆయాసం పెరుగుతుందంటున్నారు డాక్టర్లు. ముందే డాక్టర్లను కలిసి ట్రీట్ మెంట్ తీసుకుంటే బెస్ట్ అని సజెస్ట్ చేస్తున్నారు. పెద్దవారిలో కంటే చిన్న పిల్లల్లోనే ఆస్తమా పేషెంట్లు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. గాలి కాలుష్యంతోనే ఎక్కువగా హాస్పిటల్ కి వస్తున్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు. చాలా మందికి అస్తమా… ఉందనే విషయం తెలీకపోవడం కూడా మరో ప్రమాదం. ముందే గుర్తిస్తే.. త్వరగా  సమస్యను పరిష్కరించుకోవచ్చని ... వ్యాధి ముదిరితే చాలా కష్టమంటున్నారు డాక్టర్లు. 

సూచనలు: 

పిల్లల్లో దగ్గు, ఆయాసం లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
వైద్యుడు సూచించిన దాని ప్రకారం క్రమం తప్పకుండా మందులు వాడాలి.
గాలి కాలుష్యం ఉన్న ప్రాంతాల నుంచి ఎక్కువగా దూరం ఉంచాలి
ఫాస్ట్ ఫుడ్ వంటి వాటికి దూరంగా పెట్టాలి. 
ఇళ్లలో కిరోసిన్ లేదా కట్టె పోయ్యి ఉండే పిల్లల్ని వాటి నుంచి దూరం పెట్టాలి.

Trending News