Back Pain Relief In 2 Days: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది తీవ్ర అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలామంది వెన్నునొప్పి సమస్యలతో బాధపడుతున్నారు. ఇదే సమయంలో నడుము నొప్పి కూడా గురవుతున్నారు. అయితే శరీరంలో కొన్ని మార్పుల వల్ల ఉదయం పూటనే ఇలాంటి నొప్పులు రావడం విశేషం. ఒకసారి నొప్పి మొదలయితే రోజంతా అసౌకర్యంగానే ఉంటుంది. వాస్తవానికి ప్రధాన కారణం ఎముకలు బలహీనంగా మారడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఉదయం పూట ఇలాంటి నొప్పులు రావడానికి ప్రధాన కారణాలు ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధాన కారణాలు ఇవే:
ఉదయాన్నే వెన్నునొప్పి నడుము నొప్పి రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. అయితే ఇలాంటి సమస్యలు వస్తే తప్పకుండా జాగ్రత్త లు తీసుకోవాలి. అంతేకాకుండా కొన్ని అలవాట్లు కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే రాత్రి పడుకునే క్రమంలో పలు నియమాలు పాటించడం వల్ల సులభంగా ఈ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
బోలు ఎముకల వ్యాధి:
ఆస్టియోపోరోసిస్ వల్ల కూడా వెన్నునొప్పి వస్తుంది. ఎముకలు క్రమంగా బలహీనపడటం ప్రారంభించడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే ఆస్టియోపోరోసిస్‌తో బాధపడుతుంటే..వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
కాల్షియం లోపం:
శరీరానికి తగిన కాల్షియం లేకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఉదయం నిద్రలేచిన తర్వాత వెన్నునొప్పి వస్తే తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ లోపం ఉంటే పోషకాలు ఆహారాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణుల చెబుతున్నారు.
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook