Benefits Of Taro Root: చేమ దుంపతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయే తెలుసా..!!

Benefits Of Taro Root: చేమ దుంప శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చతుంది. ఇందులో ఉండే పోషక విలువలు శరీరంలో రోగ నిరోధక శక్తినిపెంపొందించడానికి కృషి చేస్తాయి. కళ్ల సమస్యలతో బాధపడుతున్న వారు ఈ దుంపతో విముక్తి పొందవచ్చని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 29, 2022, 10:26 AM IST
  • చేమ దుంపలు శరీరానికి చాల ప్రయోజనాలు
  • కంటి చూపును మెరుగు పరుస్తుంది
  • ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది
Benefits Of Taro Root: చేమ దుంపతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయే తెలుసా..!!

Benefits Of Taro Root: చేమ దుంప శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చతుంది. ఇందులో ఉండే పోషక విలువలు శరీరంలో రోగ నిరోధక శక్తినిపెంపొందించడానికి కృషి చేస్తాయి. కళ్ల సమస్యలతో బాధపడుతున్న వారు ఈ దుంపతో విముక్తి పొందవచ్చని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. చేమ దుంపలోఫైబర్, ప్రొటీన్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఆరోగ్యానికి, కళ్ళకు మేలు చేస్తాయి.  

చేమ దుంప కళ్ళ సమస్యలను దూరం చేస్తుంది:

డైట్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ రంజనా సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. చేమ దుంపలో బీటా-కెరోటిన్, క్రిప్టోక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కళ్లను బలోపేతం చేయడానికి, కంటి సమస్యల నుంచి విముక్తి పొందడానికి సహాయపడుతాయి. అంతేకాకుండా కంటిశుక్లాలను కూడా నివారిస్తాయి.

చేమ దుంప తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

1. రక్తపోటు, గుండెకు సంబంధించిన సమస్యల నుంచి విముక్తి:

చేమ దుంపలో ఉండే సోడియం, పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

2. క్యాన్సర్ నిరోధించడానికి:

చేమ దుంప క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి రక్షించడాని ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల అభివృద్ధిని నిరోధించి..క్యాన్సర్ రాకుండా చేస్తాయి.

3. షుగర్ పేషెంట్లకు చేమ దుంప:

చేమ దుంపతో  షుగర్ పేషెంట్లకు చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులో ఫైబర్‌ వంటి పోషకాలుంటాయి. కావున ఇన్సులిన్, గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది.

4. బరువు తగ్గడంలో సహాయపడుతుంది:

ఈ దుంప బరువును నియంత్రించడానికి కృషి చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్‌లు జీవక్రియను యాక్టివ్‌గా చేస్తుంది. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.

5. జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది:

చేమ దుంపలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంచడానికి తోడ్పడుతుంది.  మలబద్ధకం లేదా అజీర్ణం వంటి వ్యాధులతో బాధపడుతున్నట్లయితే దీనిని తినండి వల్ల విముక్తి పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.

 

Also Read: Heel Pain: మడమ నొప్పితో బాధపడుతున్నారా..ఈ చిట్కాను పాటించి విముక్తి పొందండి..!!

Also Read: Morning Walk Side Effects: మార్నింగ్‌ వాక్‌ చేసే సమయంలో మొబైల్ ఫోన్ వాడుతున్నారా..అయితే ఈ విషయాలను తెలుసుకోడి.!!

 

థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News