NEET UG 2024 Registration Process: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ కౌన్సెలింగ్ ప్రక్రియను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఇవాళ ప్రారంభించింది. ఎంబిబిఎస్, బీడీఎస్ కోర్సుల్లో ఆల్ ఇండియా కోటా 15 శాతం కోసం అర్హులైన అభ్యర్ధులు mcc.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియ 4 దశల్లో జరగనుంది. మొదటి దశ ఇవాళ ఆగస్టు 14 నుంచి ఆగస్టు 20వ తేదీ మద్యాహ్నం వరకూ జరుగుతుంది. అర్హులైన అభ్యర్ధులు రిజిస్ట్రేషన్‌తో పాటు పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్టు 14, 15 తేదీల్లో ప్రిలిమినరీ సీట్ మ్యాట్రిక్స్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆగస్టు 16 నుంచి ఆగస్టు 20 మద్యాహ్నం 11.55 గంటల వరకు ఛాయిస్ ఎంపిక చేసుకోవచ్చు. మొదటి దశ సీట్ల కేటాయింపు ఆగస్టు 21, 22 తేదీల్లో ఉంటుంది. ఆగస్టు 23న తుది ఫలితాలు ప్రకటిస్తారు. ఆగస్టు 24 నుంచి 29 వరకూ కేటాయించిన కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
నీట్ యూజీ కౌన్సిలింగ్ 2024 ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే
ముందుగా నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ కోసం అధికారిక పోర్టల్ mcc.nic.in ఓపెన్ చేయాలి. ఇప్పుడు నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ విభాగంలోకి వెళ్లాలి. అక్కడుండే రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేయాలి. అవసరమైన అడిగిన సమాచారం ఫిల్ చేయాలి. రిజిస్ట్రేషన్ తరువాత ఎక్కౌంట్ లాగిన్ అయి అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. తరువాత పూర్తయిన నీట్ యూజీ కౌన్సిలింగ్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
నీట్ యూజీ కౌన్సిలింగ్‌ను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ చేపడుతుంది. ఆల్ ఇండియా కోటాలో 15 శాతం సీట్లు ఉంటాయి. ఈ ఏడాది నీట్ యూజీ కౌన్సిలింగ్ నాలుగు దశల్లో జరగనుంది. ఇందులో డీమ్డ్ యూనివర్శిటీలు, ఎయిమ్స్ కళాశాలలు, జిప్‌మర్ వంటి సంస్థలు ఉన్నాయి. జూలై 26 వ తేదీన చివరిసారిగా రివైజ్ చేసిన నీట్ యూజీ 2024 ఫలితాలు వెలువడ్డాయి. 720 ఫుల్ మార్కులు 17 మందికి వచ్చాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రివైజ్డ్ ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది.
Also read: New Sim Card Rules: సెప్టెంబర్ 1 నుంచి కొత్త సిమ్ కార్డు రూల్స్, రెండేళ్ల పాటు ఆ నెంబర్లు బ్లాక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook