Hemoglobin : హిమోగ్లోబిన్ స్థాయిలను నేచురల్ గా పెంచే సూపర్ ఫుడ్స్..

Healthy food: మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తగిన మోతాదులో ఉండడం ఎంతో అవసరం. శరీరంలో ఉండవలసిన హిమోగ్లోబిన్ శాతం ఏ మాత్రం సమతుల్యత తప్పినా.. మన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతుంది. మరి మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచే సహజమైన సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2023, 07:27 PM IST
Hemoglobin : హిమోగ్లోబిన్ స్థాయిలను నేచురల్ గా పెంచే సూపర్ ఫుడ్స్..

Increase Hemoglobin Naturally : మనలో చాలామంది ఎప్పటికప్పుడు తమ ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేస్తూ ఉంటారు హడావిడి జీవనశైలి గజబిజి పరిస్థితుల కారణంగా తమపై తమకు శ్రద్ధ తీసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది . మనం తీసుకునే ఆహారం శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్ అందించే విధంగా ఉండాలి.. కానీ కుటుంబ సభ్యుల మీద పెట్టే శ్రద్దలో 10 శాతం కూడా ఆడవారు తమ మీద తాము పెట్టుకోవడం లేదు .అందుకే తెలియకుండా ఎన్నో రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు వాటిలో ముఖ్యమైనది రక్తహీనత.

ఎర్ర రక్త కణాలలో కనిపించే ప్రోటీనే హిమోగ్లోబిన్. శరీరం మొత్తానికి ఆక్సిజన్ సప్లై చేయడం ఈ రక్త కణాల యొక్క ముఖ్యమైన పని. అయితే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే.. దాని ప్రభావం పూర్తి శరీరం యొక్క పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల కేవలం రక్తహీనత తో పాటు కిడ్నీ ,లివర్ పనితీరుపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది. రక్తంలో అవసరమైన హిమోగ్లోబిన్ శాతం కంటే తక్కువ ఉంటే మనం ఎప్పుడు అలసట, బలహీనత లాంటి లక్షణాలతో బాధపడతాము.

బీట్ రూట్:

శరీరంలో హిమోగ్లోబిన్ ను ఇంటి వద్దని సహజంగా లభించే కొన్ని ఆహార పదార్థాలతో సులభంగా పెంచవచ్చు. వీటిలో ముఖ్యమైనది బీట్రూట్.. ఇందులో ఐరన్, మెగ్నీషియం ,కాపర్, ఫాస్ఫరస్ తో పాటుగా విటమిన్ బి 1, బి 6, బి 12 పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి హిమోగ్లోబిన్ శాతాన్ని అభివృద్ధి చేస్తాయి.

మునగ ఆకు:

మనలో చాలామందికి మునక్కాయ తెలిసినంతగా మునగ ఆకు గురించి తెలియదు. తినడానికి చేదుగా ఉంటుందని పెద్దగా ఇష్టపడరు కూడా. అయితే వీటిలో అధిక మోతాదులో జింక్ ,ఐరన్ ,కాపర్ ,మెగ్నీషియంతో పాటు శరీరానికి అవసరమైన ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. ఇది హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడమే కాకుండా అధిక రక్తపోటును నియంత్రించి ..శరీర బరువును కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.

బచ్చలికూర:

ఇంటిలో సులభంగా పెంచుకోదగిన ఈ ఆకుకూర ఒక్కసారి వేస్తే సంవత్సరాల తరబడి ఆకుకూర అందిస్తూనే ఉంటుంది. ఇందులో పోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి.

దానిమ్మ:

దానిమ్మకాయలు ప్రోటీన్ ,ఫైబర్ తో పాటు కాల్షియం ,ఐరన్ ఎక్కువగా ఉంటాయి. రోజు దానిమ్మ జ్యూస్ తాగేవారికి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరగడమే కాకుండా ఒక శుద్ధి కూడా జరుగుతుంది. దానిమ్మ రోజు తీసుకోవడం వల్ల బ్లడ్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది.

గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది. కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News