Protein Diet: ఈ 5 పదార్ధాలు డైట్‌లో ఉంటే, ఇక మాంసాహారం అవసరం లేదు

Protein Diet: మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి ప్రోటీన్లు చాలా చాలా అవసరం. అందుకే ప్రోటీన్ ఆహారం ఎక్కువగా తినమని వైద్యులు పదే పదే సూచిస్తుంటారు. ఈ ప్రోటీన్ ఆహారం జాబితాలో ఏమేం ఉన్నాయి, ఏయే పదార్ధాలు తినవచ్చనేది తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 5, 2023, 06:33 PM IST
Protein Diet: ఈ 5 పదార్ధాలు డైట్‌లో ఉంటే, ఇక మాంసాహారం అవసరం లేదు

Protein Diet: సాధారణంగా ప్రోటీన్ ఆహారం అనగానే నాన్ వెజ్ గుర్తొస్తుంది. ముఖ్యంగా చేపలు, మాంసం, గుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయనడంలో సందేహం అవసరం లేదు. అందుకే నాన్ వెజ్ తినేవారిలో ప్రోటీన్ లోపం తలెత్తదు. మరి శాకాహారుల పరిస్థితి ఏంటి, ఆ వివరాలు మీ కోసం..

ప్రోటీన్ పుడ్ కోసం కేవలం మాంసాహారమే కాదు..శాకాహారం కూడా తీసుకోవచ్చు. కొన్ని రకాల శాకాహార పదార్ధాల్లో ప్రోటీన్లు పెద్దమొత్తంలో ఉంటాయి. అధిక బరువు, వివిధ రకాల వ్యాధుల్నించి విముక్తి పొందే క్రమంలో చాలామంది మాంసాహారం మానేస్తుంటారు. అయితే ప్రోటీన్ ఫుడ్ ఎలా అనే సందేహం తలెత్తుతుంటుంది. అయితే కొన్ని రకాల శాకాహార ఆహార పదార్ధాల్లో ప్రోటీన్లు కావల్సినంతగా లభిస్తాయి. ఇందులో పప్పు ధాన్యాలు, సోయా బీన్స్, క్వినోవా, టోఫు, గ్రీక్ యోగర్ట్ వంటివి అతి ముఖ్యమైనవి. 

టోఫు అనేది సోయాబీన్ ఆధారిత ఆహారం. ఇందులో ప్రోటీన్లు కావల్సినంతగా లభిస్తాయి. కేవలం సగం కప్పు టోఫులో శరీరానికి 15 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. టోఫు అనేది పన్నీరులా ఉండే పదార్ధం. రుచి కూడా బాగుంటుంది. ఇక ప్రోటీన్లు పుష్కలంగా ఉండే మరో శాకాహార పదార్ధం గ్రీక్ యోగర్ట్. మీ ఆహారంలో పాల ఉత్పత్తులు చేరిస్తే ప్రోటీన్ లోపం ఉండదు. గ్రీక్ యోగర్ట్  అనేది ప్రోటీన్లు పుష్కలంగా ఉండే పదార్ధం. ఇందులో ప్రో బయోటిక్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది. 

పప్పు ధాన్యాలైతే ప్రోటీన్లకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పవచ్చు. ప్రతి కప్పు పప్పు ధాన్యాల్లో 18 గ్రాముల ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. దీనిని చాలారకాలుగా సేవించవచ్చు. సూప్, సలాడ్ లేదా వెజ్ బర్గర్ ఇలా ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. చాలామంది కూర రూపంలో తీసుకుంటారు. 

క్వినోవా అనేది పూర్తి స్థాయి ప్రోటీన్ ఆధారిత ఆహారం. ఇందులో 9 రకాల ఎసెన్షియల్ ఎమైనో ఆసిడ్స్ ఉంటాయి. క్వినోవా వండిన తరువాత దాదాపుగా 8 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. అందుకే డైట్‌లో క్వినోవాను భాగంగా చేసుకుంటే శరీరానికి కావల్సిన ప్రోటీన్లు అందుతాయి.

Also read: Winter Foods: వింటర్ సీజన్‌లో తప్పక తినాల్సిన ఆహారాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News