Sharing Soap: సోప్‌ విషయంలో ఈ జాగ్రత్తలు చాలా అవసరమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు!

Can Multiple People Use The  Same Soap: మన శరీరంపై దుమ్ము, దూళి, క్రిములు ఎక్కువగా చేరుతాయి. వీటిని తొలగించి శరీరం శుభ్రంగా ఉంచుకోవడానికి మనం  డైలీ స్నానం చేస్తుంటాం. అయితే కొంతమంది ఇంట్లో ఒకే సోప్‌ ను వాడుతుంటారు.  ఒక సోప్‌ను ప్రతిఒక్కరు వాడుతూ ఉండటం వల్ల చర్మ సమస్యలు తలెత్తుతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2024, 08:38 PM IST
Sharing Soap:  సోప్‌ విషయంలో ఈ జాగ్రత్తలు చాలా అవసరమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు!

Can Multiple People Use The Same Soap: కొంతమంది  ఒకే సోప్ చాలామంది ఉపయోగిస్తారు. అయితే ఇలా ఒకే సోప్‌ను ఉపయోగించడం వల్ల ఎంతో ప్రమాదం అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. సోప్‌ మన శరీరాని  క్లీన్ చేయడంలో సహాయపడుతుంది. కానీ సోప్‌ దానిని  శుభ్రం చేసుకొనే శక్తిని పొంది ఉండదు. సోప్‌తో స్నానం చేసినప్పుడు శరీరంపై ఉన్న బ్యాక్టీరియా,  వైరస్ సబ్బుపైకి చేరుతుంది. 2006లో ఇండియన్ జర్నల్ ఆఫ్ డెంటల్ రీసెర్చ్‌లో  కొన్ని వాడిన సబ్బులను టెస్ట్ చేసినప్పుడు వాటిపై వివిధ రకాల సూక్ష్మజీవులను గుర్తించారు.

ఈ సబ్బుల మీద తీవ్ర హానికరమైన బ్యాక్టీరియాలు ఉన్నయని తెలిపారు. ముఖ్యంగా  షిగెల్లా, సాల్మోనెల్లా , ఈ కోలి, నోరో ఇతర డేంజరస్‌ బ్యాక్టీరియాను వారు గమనించారు. కాబట్టి ఒకరు ఉపయోగించిన సోప్ను ఇతరులు వాడకూడదని నిపుణులు చెబుతున్నారు.  వాటి మీద ఉండే క్రీములు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే చాన్స్ ఉంటుంది. 

ఏవైనా చర్మ సమస్యలతో బాధపడుతున్నవారు వాడిన సబ్బుతో ఇతరులు ఉపయోగించడం వల్ల ఆ జెర్మ్స్‌ మరొకరి వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని సార్లు సబ్బు పెట్టెలో కూడా నీరు నిల్వగా ఉంటుంది. ఇలా నీరు నిల్వగా ఉన్న పెట్టెలో కూడా హానీకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. 

Also Read Appetite Boosting Foods: పిల్లల్లో ఆకలి కలిగించే ఆహార పదార్ధాలు ఇవే!

అంతేకాకుండా సబ్బుని గాలి తగిలేలా ఉంచాలి. సబ్బుకి బదులుగా లిక్విడ్ హ్యాండ్ సోప్ ని, లిక్విడ్ బాడీ వాష్ ని వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వాడాలంటే సబ్బుపై ఉన్న నురగ పోయే వరకు శరీరాని శుభ్రం చేసుకోవాలి. కొంతమేర ఇన్ఫెక్షన్లు తగ్గొచ్చు. 

ఇక సబ్బుపై బాక్టీరియా పెరగకుండా ఉండాలంటే వాడిన తరువాత ఆరబెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అలానే టవల్స్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఒకరి యూజ్ చేసేవి మరొకరు వాడకూడదు అన్నది వైద్యుల సూచన. అంతేకాకుండా ఒక వస్తువును ప్రతి ఒక్కరు వాడకుండా ప్రతి ఒక్కరిని వారి వారి సోప్‌, టవల్స్‌, దువెన ఉండాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఎలాంటి హాని కరమైన బ్యాక్టీరియా, వైరస్‌ సమస్యల బారిన పడాల్సి ఉండదు.

Also Read Remedies For Cold And Cough: దగ్గు, జలుబుతో బాధపడుతున్నవారు ఈ చిట్కాను ట్రై చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News