Causes of weight Gain: బరువు పెరగుతున్నారా... తప్పకుండా వీటిపై శ్రద్ధ వహించండి..!

Causes of weight Gain: ప్రస్తుతం చిన్న, పెద్ద తేడా లేకుండా అందరు బరువు పెరుగుతున్నారు. దీంతో వారు అనారోగ్యం  పాలవుతున్నారు.  బరువు పెరగడానికి మొదటి కారణం జీవనశైలి. ప్రస్తుతం ఉన్న జీవనశైలి కారణంగా ఆహారంలో మార్పులు వస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 4, 2022, 05:17 PM IST
  • బరువు పెరగడానికి 5 పెద్ద కారణాలు
  • థైరాయిడ్ వచ్చిన బరువు పెరుగుతారు
  • ఒత్తిడి వల్ల కూడా బరువు పెరుగుతారు
Causes of weight Gain: బరువు పెరగుతున్నారా... తప్పకుండా వీటిపై శ్రద్ధ వహించండి..!

Causes of weight Gain: ప్రస్తుతం చిన్న, పెద్ద తేడా లేకుండా అందరు బరువు పెరుగుతున్నారు. దీంతో వారు అనారోగ్యం  పాలవుతున్నారు.  బరువు పెరగడానికి మొదటి కారణం జీవనశైలి. ప్రస్తుతం ఉన్న జీవనశైలి కారణంగా ఆహారంలో మార్పులు వస్తున్నాయి. దీంతో అధికంగా బరువు పెరిగి ఇబ్బందుల బారిన పడుతున్నారు. వ్యాయామం చేయక పోవడం, గంటల తరబడి ఒకే చోట పని చేయడం దీనికి ప్రధాన కారణమవుతున్నాయి. ఇవే కాకుండా బరువు పెరగడానికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. థైరాయిడ్ వచ్చిన బరువు పెరుగుతారు:

 థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు సులభంగా బరువు పెరుగుతారు. వాస్తవానికి ఈ వ్యాధి వల్ల శరీరంలోని జీర్ణక్రియ బలహీనంగా మారుతుంది. దీని కారణంగా బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

2. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా బరువు పెరుగుతారు:

 మధుమేహ రోగులు కూడా బరువు పెరుగుతారు. ఈ రోగులు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.  లేకపోతే భవిష్యత్తులో సమస్య ఎదుర్కొవాల్సి ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.

3. ఒత్తిడి వల్ల కూడా బరువు పెరుగుతారు:

మారుతున్న జీవనశైలి కారణంగా మనుషులు చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో వీరు పనులను రిస్క్‌ లేకుండా ఎలాంటి ఒత్తిడి లేకుండా చేసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. లేదంటే శరీరంలో సమస్యలు ఏర్పాడి బరువు పెరుగుతారు. అయితే ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకు రోజూ యోగా, వ్యాయామాలు చేస్తే మంచిదని సూచిస్తున్నారు. 

4. జీర్ణక్రియలు చెడిపోవడం వల్ల:

జీర్ణక్రియలు చెడిపోవడం కారణంగా కూడా అధిక బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీనిని బాలోపేతం చేయడానికి పండ్లు, కూరగాయలను, పోషకాలుండే ఆహారాన్ని తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

5. ఆయిల్ ఫుడ్:

ఆయిల్‌ఫుడ్, జంక్‌ ఫుడ్‌ తినకూడదని అందరు అంటూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు కూడా తెలుపుతున్నారు. అలాంటప్పుడు ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలని వారు చెబుతున్నారు.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Walnuts For Men Health: రోజులో ఎన్ని వాల్‌నట్‌లు తింటే మంచిది..పురుషులకు ఇవి ఎంత ప్రయోజనాన్ని ఇస్తుందో తెలుసా..?

Also Read:TRS Rajyasabha Names:పెద్దల సభకు ముగ్గురు వ్యాపారవేత్తలే.. చివరి నిమిషంలో కేసీఆర్ ట్విస్ట్ 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

 

 

Trending News