Get Relief from Joint Pain Naturally: ప్రస్తుతం చాలామందిలో చలికాలంలోనే కాకుండా ఎండాకాలంలో కూడా కీళ్ల నొప్పులు సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ నొప్పులతో బాధపడేవారు మార్కెట్లో లభించే ఖరీదైన ఔషధాలను వినియోగించినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. ప్రతిరోజు వేసవిలో పోషకాలు కలిగిన ఫ్రూట్స్ తినడం వల్ల సులభంగా కీళ్ల నొప్పులకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్ల లో ఉండే పోషక గుణాలు కీళ్ల నొప్పులను తగ్గించడమే కాకుండా.. వేసవి కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయి.
కీళ్ల నొప్పులను తగ్గించుకునేందుకు వేసవిలో ఈ పండ్లను తినండి:
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన పండ్లు:
సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే వీటిలో లభించే పోషకాలు శరీరం అనారోగ్య సమస్యల బారిన పడకుండా రక్షిస్తాయి. అంతేకాకుండా నీళ్ల నొప్పులు, ఆర్థో సమస్యను తగ్గించేందుకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ప్రతిరోజు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి చెర్రీలను తీసుకోవాల్సి ఉంటుంది.
యాంటీ ఆక్సిడెంట్ల కలిగిన పండ్లు:
శరీరానికి సరైన పరిమాణంలో యాంటీ ఆక్సిడెంట్లు అందితేనే ఆరోగ్యంగా ఉంటాం. శరీరంలో వీటి లోపం ఉంటే తీవ్ర కీళ్ల నొప్పులు, వాపులు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ లోపాన్ని తగ్గించుకోవడానికి ప్రతిరోజు ఆహారంలో చెర్రీస్, బ్లాక్ బెర్రీలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అధిక పరిమాణంలో యాంటీ ఆక్సిడెంట్ల లభించడమే కాకుండా విటమిన్ ఇవి కూడా ఉంటుంది. ప్రతిరోజు ఈ పండ్లను తినడం వల్ల సులభంగా యూరిక్ యాసిడ్ సమస్యలు దూరమవుతాయి.
Also Read: CSK Vs GT Rain Updates: ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడి దెబ్బ.. పూర్తి సమీకరణలు ఇలా..
విటమిన్ 'C' అధికంగా ఉండే ఆహారాలు:
వేసవిలో తప్పకుండా విటమిన్ సి అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఎండ కారణంగా వచ్చే చర్మ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు విటమిన్ సి కలిగిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా శరీరంలో యూరిక్ యాసిడ్ కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: CSK Vs GT Rain Updates: ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడి దెబ్బ.. పూర్తి సమీకరణలు ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook