Constipation Home Remedies: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది ఆహారాల్లో మార్పులు చేర్చులు చేసుకుంటున్నారు. మరికొందరైతే ఆయిల్ ఫుడ్స్, అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుని పొట్ట సమస్యల బారిన పడుతున్నారు. మరికొందరిలో మలబద్ధకం సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా రోజూ వారి ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉంటే వాటిని తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ కింద పేర్కొన్న ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవడం వల్ల సులభంగా మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ ఆహారాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
ఓట్స్ మీల్:
ఓట్స్‌లో ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి ఓట్స్‌ను ప్రతి రోజూ ఆహారంగా తీసుకుంటే సులభంగా మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జీర్ణ క్రియ సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.
అంజీర్:
అంజీర్ పండ్లను తినడం వల్ల శరీర బరువు తగ్గడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలకు ప్రభావవంతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే పొట్ట సమస్యలు, మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ నీటిలో నానబెట్టిన అంజీర్ పండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
పాలు, నెయ్యి:
పాలు, నెయ్యి వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే.. అయితే మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ పాలు, పెరుగు తాగడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా ప్రతి రోజూ రెండు చెంచాల నెయ్యిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
లైకోరైస్:
ఆయుర్వేద శాస్త్రంలో లైకోరైస్ ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా తీవ్ర పొట్ట సమస్యలను కూడా సులభంగా తగ్గిస్తుంది. అయితే మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ నీటిలో దీని పొడిని కలుపుకుని తాగడం వల్ల సులభంగా పొట్ట సమస్యలు తగ్గుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Pawan Kalyan: చంద్రబాబుకు అండగా పవన్ కళ్యాణ్ సపోర్ట్.. వైసీపీ పాలనలోనే ఇలా చూస్తున్నాం..
Also Read: Interest Free Loan: ఈ రాష్ట్ర రైతులకు గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook