Curry Leaves Water: ఉద‌యాన్నే క‌రివేపాకుల నీళ్ల‌ను తాగితే చెప్ప‌లేన‌న్ని లాభాలు..

Curry Leaves Water Benefits: కరివేపాకు తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు, విటమిన్‌లు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, చర్మం, జుట్టు సంరక్షణలో కీలక ప్రాత పోషిస్తుంది. అయితే కరివేపాకు నీటిని ఉదయం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.   

Written by - Shashi Maheshwarapu | Last Updated : Aug 29, 2024, 11:18 AM IST
Curry Leaves Water: ఉద‌యాన్నే క‌రివేపాకుల నీళ్ల‌ను తాగితే చెప్ప‌లేన‌న్ని లాభాలు..

Curry Leaves Water Benefits: కరివేపాకును మనం ప్రతిరోజు వంటల్లో ఉపయోగిస్తాము. కరివేపాకులేకుండా వంటలో రుచి ఉందడు. దీంతో కొందరూ పొడులు, చట్నీలు, పులిహోర తయారు చేసుకుంటారు. అయితే కరివేపాకు కేవలం వంటలకు మాత్రమే కాకుండా ఆరోగ్యాని కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే కరివేపాకుతో తయారు చేసిన నీటిని ఉదయం తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు ఏంటో, ఎలా ఉపయోగించాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. 

కరివేపాకు ఆకులు చిన్నగా కనిపించినా ఇందులో చెప్పలేని ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్‌ ఎ, సి, ఇ వంటి విటమిన్లు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా దొరుకుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే చెడు కణాలను తొలగించడంలో ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజు కరివేపాకు నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు గురించి ఇక్కడ తెలుసుకోండి.

కరివేపాకు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

కరివేపాకు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు జీర్ణకోశాన్ని శుభ్రపరచి, ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తాయి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. ఇవి చర్మాన్ని మెరుగుపరుస్తాయి. ముఖంపై మొటికలు, మచ్చలు తొలగించి, చర్మాన్ని మెరిసిపోయేలా చేస్తాయి. ఇదీ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.  ఇది శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. కరివేపాకులో ఉండే ఫైబర్ మనకు ఎక్కువ సేపు ఆకలి తీరేలా చేస్తుంది. తద్వారా అనవసరమైన ఆహారం తినకుండా నియంత్రిస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రివేపాకులో ఉండే పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

కరివేపాకు వాటర్ తయారీ విధానం:

కావలసిన పదార్థాలు:

కరివేపాకు ఆకులు - ఒక కప్పు (కొత్తగా కోసినవి)
నీరు - 3 కప్పులు

తయారీ విధానం:

ఒక పాత్రలో నీటిని వేడి చేయండి. నీరు కాచుతున్నప్పుడు, కరివేపాకు ఆకులను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకోండి. నీరు మరిగిన తర్వాత, కరివేపాకు ముక్కలను నీటిలో వేసి మూత పెట్టి 5-10 నిమిషాలు మరిగించండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, కషాయాన్ని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక గ్లాస్‌లోకి వడకట్టి తాగవచ్చు.

ఎప్పుడు తాగాలి:

ఉదయాన్నే ఉపవాసం ఉన్నప్పుడు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
భోజనం చేసిన తర్వాత ఒక గంట తర్వాత తాగవచ్చు.

ముఖ్యమైన విషయాలు:

కరివేపాకు నీళ్లు ప్రతి ఒక్కరికీ సరిపోవు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
అధికంగా కరివేపాకు నీళ్లు తాగడం వల్ల కడుపు నొప్పి, అతిసారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

గమనిక:

ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, వైద్యుని సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

Also read: Black Salt: వేడి నీళ్లలో దీన్ని కలుపుకుని తాగితే నిమిషాల్లో బ్లడ్ షుగర్ నార్మల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x