Diabetes Control In 10 Days: ప్రస్తుతం చాలామంది చిన్న వయసులోనే డయాబెటిస్ బారిన పడుతున్నారు. అంతేకాకుండా మధ్య వయసులోనే తీవ్ర మధుమేహానికి గురవుతున్నారు. అయితే భారత్లో రోజురోజుకు వీరి సంఖ్య పెరగడం విశేషం. ఈ వ్యాధి వల్ల చాలా మంది దీర్ఘ కాలిక సమస్యల బారిన పడుతున్నారు. అయితే వీరు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు కోరుతున్నారు. ముఖ్యంగా జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల కూడా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్నారు. అయితే దీనికోసం రోజు పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం పూట తీసుకునే అల్పాహారంలో భాగంగా స్వల్ప మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ నియమాలు తప్పకుండా పాటించాలి:
1. మధుమేహంతో బాధపడుతున్న వారు తప్పకుండా అల్పాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు తీసుకునే ఆహారంలో చక్కెర పరిమాణాలు తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. అంతేకాకుండా పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
2. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తప్పకుండా శరీరాన్ని హైడ్రేట్ ఉంచుకోవాల్సి ఉంటుంది. దీనికోసం వీరు మంచినీటిని అధిక పరిమాణంలో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలా తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ కూడా శక్తివంతంగా అవుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
3. మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వారు తప్పకుండా శరీర శ్రమ చేయాల్సి ఉంటుంది. దీనికోసం వ్యాయామాలు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతే కాకుండా శరీరం దృఢంగా మారుతుంది. శరీరంలో రక్తం ప్రక్రియ కూడా సజావుగా సాగుతుంది. దీంతో రక్తంలో చక్కెర పరిమాణం తగ్గిపోతుంది. మధుమేహం కూడా సులభంగా నియంత్రణలోకి వస్తుంది. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు తప్పకుండా వ్యాయామాలు చేయాలి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి యోగా నిపుణుడిని సంప్రదించండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Telugu Movies this Week: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!
Also Read: Amala Paul on Tollywood: టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్.. నెపోటిజం, రొట్ట సినిమాలు అంటూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి