Foods To Avoid On Pregnancy: గర్భంతో ఉన్నప్పుడు తినకూడని ఆహార పదార్థాలు

Foods To Avoid On Pregnancy: గర్భంతో ఉన్న వారికి ఆహార నియమావళి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల ఫుడ్స్ తినడం వల్ల గర్భం కూడా పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆహారం విషయంలో మీ డాక్టర్ ని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది హెల్త్ కేర్ ఎక్స్‌పర్ట్స్ ఇచ్చే సలహా.

Written by - Pavan | Last Updated : Jun 10, 2023, 11:06 PM IST
Foods To Avoid On Pregnancy: గర్భంతో ఉన్నప్పుడు తినకూడని ఆహార పదార్థాలు

Foods To Avoid On Pregnancy: గర్భంతో ఉన్నప్పుడు తినే ఆహారం విషయంలో తీసుకునే పానియాల విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే గర్భిణి ఆరోగ్యంతో పాటు ఆమె కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యానికి కూడా అంత మంచిది. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. లేదంటే దాని దుష్బ్రభావాలు ఆ గర్భిణి ఆరోగ్యంతో పాటు కడుపులో ఉండే బిడ్డపై కూడా పడే ప్రమాదం ఉంటుంది. 

కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల ఫుడ్స్ తినడం వల్ల గర్భం కూడా పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆహారం విషయంలో మీ డాక్టర్ ని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది హెల్త్ కేర్ ఎక్స్‌పర్ట్స్ ఇచ్చే సలహా.

ఎలాంటి ఆహారం తీసుకోవద్దంటే ..
పండ్లు, కూరగాయాలు లాంటి ఆహార పదార్థాలు శుభ్రంగా కడిగిన తరువాతే తినడమైనా లేదా వంటకు ఉపయోగించడం అయినా చేయాలి. ఎందుకంటే పండ్లు, కూరగాయలపై కంటికి కనిపించని ఎన్నో రసాయనాలు, ఇతర మలినాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి హానీ చేస్తాయి.  

స్ప్రౌట్స్‌లో పచ్చి కూరగాయలు కలిపి తినే అలవాటు ఉంటుంది. కానీ ఇందులో సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యానికి హానీ చేస్తుంది. 

సాఫ్ట్ చీజ్ 
కడగని కూరగాయలు, పండ్లలో ఎలాగైతే కంటికి కనిపించని రసాయనాలు, బ్యాక్టీరియా ఉంటాయో ... అలాగే సాఫ్ట్ చీజ్ లోనూ లిస్టిరియా అని ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఈ లిస్టిరియా అనే బ్యాక్టీరియా ఎంత ప్రమాదకరం అంటే.. ఇది తినడం వల్ల కొన్నిసార్లు గర్భిణిలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉండటం మాత్రమే కాదు.. ఏకంగా గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉడకబెట్టని పచ్చి పదార్థాలు 
పరిశుభ్రంగా కడిగి వండిన ఆహార పదార్థాలు మాత్రమే తినాలి. పచ్చివి అసలే తినొద్దు. కొన్నిసార్లు పచ్చివి తిన్నప్పుడు వాటిలో ఉండే ఇన్‌ఫెక్షన్స్, బ్యాడ్ బ్యాక్టీరియాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. 

పచ్చి గుడ్లు, సగం ఉడకబెట్టిన గుడ్లు తినొద్దు
పచ్చి కోడి గుడ్లలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది గర్భిణిల ఆరోగ్యంపై తీవ్ర దుష్ర్పభావం చూపిస్తుంది. అందుకే పూర్తిగా ఉడకబెట్టిన గుడ్లు మాత్రమే తినాలి.

ప్రాసెస్ చేసిన మాంసం..
ప్రాసెస్ చేసిన మాంసం తిననే వద్దు. ఇందులో అధిక మొత్తంలో సోడియం, ఆరోగ్యానికి హాని తలపెట్టే కొవ్వు నిక్షిప్తమై ఉంటాయి. అందుకే ప్రాసెస్డ్ మీట్‌కి దూరంగా ఉండాలి.

పొప్పాయి పండు ..
పొప్పాయి పండు అసలే తినొద్దు. ఇది తినడం వల్ల బిడ్డ పూర్తిగా, ఆరోగ్యంగా ఎదగక ముందే కాన్పు అయ్యే ప్రమాదం ఉంటుంది. 

Trending News