Gas and Gas Pain: ఈ పప్పులు ప్రతి రోజు తింటే గ్యాస్-ఎసిడిటీ సమస్యలు రావడం ఖాయం! మీ ఈ సమస్యలు ఉన్నాయా?

Gas and Gas Pain: ఈ కింది పప్పులను ప్రతి రోజు తీసుకుంటే తీవ్ర గ్యాస్‌ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధిక పరిమాణంలో ప్రోటీన్స్‌ లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల తీవ్ర పొట్ట సమస్యలకు దారీ తీయోచ్చు. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 16, 2023, 02:34 PM IST
Gas and Gas Pain: ఈ పప్పులు ప్రతి రోజు తింటే గ్యాస్-ఎసిడిటీ సమస్యలు రావడం ఖాయం! మీ ఈ సమస్యలు ఉన్నాయా?

 

Which Dal Causes Most Gas: ఆధునిక జీవనశైలి పాటించే చాలా మందిలో పొట్ట సమస్యలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం తీసుకునే ఆహారాల్లో ఎక్కువగా అనారోగ్యకమైవే ఉండడమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మంది చిన్న వయస్సులతోనే గ్యాస్-ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. వీటి కారణంగా ఎలాంటి పనులు సరిగ్గా చేయలేకపోతున్నారు. అయితే చాలా మందిలో ప్రోటీన్‌ అధిక మోతాదులో లభించే ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా గ్యాస్-ఎసిడిటీ సమస్యలు వస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ప్రోటీన్స్‌ అధిక పరిమాణంలో లభించే కొన్ని పప్పులను తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

తీవ్ర గ్యాస్‌కు కారణమయ్యే పప్పులు ఇవే:
పెసర పప్పు:

మూంగ్ దాల్ శరీరానికి కావాల్సిన చాలా రకాల ప్రోటీన్స్‌ లభిస్తాయి. దీనిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులుభంగా ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఈ పప్పును అతిగా తీసుకోవడం వల్ల గ్యాస్‌ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పప్పు తీసుకున్న తర్వాత ఒక గ్లాస్‌ లస్సీని తీసుకోవాల్సి ఉంటుంది. 

బఠానీ:
బఠానీని ప్రతి రోజు తినడం వల్ల కూడా పొట్టలోని గ్యాస్‌ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బఠానీలో కూడా అధిక పరిమాణంలో ప్రోటీన్స్‌ లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల గ్యాస్-ఎసిడిటీ సమస్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అతిగా తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. 

ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?

శనగ పప్పు:
శనగ పప్పులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్ అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల గ్యాస్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పప్పును అతిగా తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పొట్ట సమస్యలతో బాధపడేవారు ఈ పప్పును అతిగా తీసుకోవడం మానుకోవాలి.

బీన్స్:
రాజ్మా పప్పు కూడా శరీరానికి చాలా మంచిది..ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కానీ క్రమం తప్పకుండా తినడం వల్ల గ్యాస్-ఎసిడిటీ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News