టీబీ పేషంట్లకు ఉచితంగా మందు

టీబీ పేషంట్లకు శుభవార్త. ఇకపై అన్ని మెడికల్ షాపుల్లో, వైద్యుల వద్ద టీబీ మందు ఉచితంగా లభిస్తుంది.

Last Updated : Nov 20, 2017, 02:45 PM IST
టీబీ పేషంట్లకు ఉచితంగా మందు

టీబీ పేషంట్లకు ఉచితంగా మందులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై టీబీ పేషంట్లకు ఇచ్చే రోజువారి మందును అన్ని మెడికల్ షాపులు, ప్రవేట్ హాస్పిటల్స్, వైద్యులు ఉచితంగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఉచితంగా ఇచ్చే ఈ మందును డబ్బుతో ముడిపెట్టితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రవేట్ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకోవాలనుకొనేవారి కోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని ప్రముఖ హాస్పిటల్స్, ఐఎంఏ, ఇతర వైద్య అనుబంధ సంస్థలు తప్పనిసరిగా డైలీ ఫిక్సడ్ డ్రగ్ కాంబినేషన్ (ఎఫ్డిసి) అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.

Trending News