Milk with Dry grapes: పాలు ఆరోగ్యానికి బెస్ట్ డ్రింక్. ఇందులో కొద్దిగా ఎండుద్రాక్ష కలిపి తాగితే ఇక అద్భుత ప్రయోజనాలే. పాలలో ఎండుద్రాక్ష మిక్స్ చేసి తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం..
మనం రోజూ తీసుకునే ఆహారపు అలవాట్లే ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ఆహారపు అలవాట్లు బాగుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. లేకుంటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. మెరుగైన ఆరోగ్యం కోసం డైట్‌లో పాలు, ఎండుద్రాక్ష చేర్చుకుంటే చాలని..అద్భుత ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు వైద్య నిపుణులు.
పాలు, ఎండుద్రాక్ష..రెండింట్లోనూ పోషక పదార్ధాలు పుష్కలంగా లభిస్తాయి. ఎండుద్రాక్షలో హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, కాపర్, ఐరన్, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటే..పాలలో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ డి అత్యధికంగా ఉంటాయి. అందుకే ఈ రెండూ కలిపి ప్రతిరోజూ తాగితే శరీరంలో పోషక పదార్ధాల లేమి తలెత్తదు. ఫలితంగా గంభీరమైన రోగాలు దూరమౌతాయి. ఆరోగ్యం బాగుంటుంది. పాలు, ఎండుద్రాక్ష కలిపి తాగడం వల్ల ఏయే ప్రయోజనాలున్నాయో చూద్దాం..
మెమరీ పవర్
ప్రతిరోజూ పాలు, ఎండుద్రాక్ష కలిపి తీసుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యల్ని జయించవచ్చు. ముఖ్యంగా మెమెరీ పెరుగుతుంది. మెదడు పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే బుద్ధి వికసితమౌతుంది. రాత్రి పడుకునేముందు పాలలో ఎండుద్రాక్ష కలిపి తాగడం వల్ల సుఖమైన నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఇదొక మంచి ఔషధం కాగలదు. త్వరగా పడుకునేందుకు కూడా దోహదమౌతుంది.
ఎముకలకు బలం
పాలు, ఎండుద్రాక్ష రెండింట్లోనూ కాల్షియం పుష్కలంగా ఉంటున్నందున..ఈ రెండు కలిపి తీసుకోవడం ద్వారా ఎముకలకు బలం చేకూరుతుంది. ఎండుద్రాక్షలో ఉండే బోరాన్ అనే కెమికల్ ఎముకలకు చాలా లాభదాయకం. అటు కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. ఫ్రాక్చర్ కారణంగా ఏర్పడే గాయాలు తగ్గుతాయి. ఇతర చాలా గంభీరమైన రోగాలకు పాలు-ఎండుద్రాక్ష మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది.
ఎండుద్రాక్షలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపర్చడమే కాకుండా మెటబోలిజంను వృద్ధి చేస్తుంది. శరీరంలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. కోలన్ పనితీరు మెరుగుపడుతుంది. శరీరాన్ని ఎప్పటికప్పుడు డీటాక్సిఫై చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము.
Also read: Ginger and jaggery Tea: టీలో పంచదార స్థానంలో బెల్లం, అల్లం కలిపితే..అద్భుతమే
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook