Benefits Of Yellow Moong Dal: ఎల్లో మూంగ్ దాల్ తినండి... ఈ వ్యాధులకు చెక్ పెట్టండి

Benefits Of Yellow Moong Dal: పెసర పప్పు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక రకాల పోషకాలు ఇందులో ఉంటాయి. ఈ ఎల్లో మూంగ్ దాల్ మీ శరీరానికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : May 16, 2022, 05:38 PM IST
Benefits Of Yellow Moong Dal: ఎల్లో మూంగ్ దాల్ తినండి... ఈ వ్యాధులకు చెక్ పెట్టండి

Benefits Of Yellow Moong Dal: మనమందరం ఖచ్చితంగా ఎల్లో మూంగ్ దాల్ (పెసరపప్పు)ను ఆహారంలో భాగంగా తీసుకుంటాం. మూంగ్ దాల్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి అనేక రకాల పోషకాలు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ఐరన్, విటమిన్ బి6, నియాసిన్, ప్రొటీన్లు కూడా ఇది కలిగి ఉంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మరియు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని యెుక్క ప్రయోజనాలేంటో (Benefits Of Yellow Moong Dal) పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం.

డయాబెటిస్‌కు చెక్
మధుమేహ వ్యాధిగ్రస్తులకు పెసర పప్పు చాలా మంచిది. ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం ఇందులో అధిక మెుత్తంలో ఉంటాయి. ఇది డయాబెటిస్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది. పసుపు పప్పు తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ఇది ఇన్సులిన్ రక్తంలో చక్కెర మరియు కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

జీర్ణశక్తి
ఎల్లో మూంగ్ దాల్ తినడం వల్ల మీ జీర్ణశక్తి కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఉదర సంబంధిత సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పప్పులో ఉంటాయి కాబట్టి ఇది మీ కడుపులో గ్యాస్ ఏర్పడకుండా చేస్తుంది. ఈ విధంగా, ఇది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.

చర్మానికి మేలు
ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే మినరల్స్ శరీరం యొక్క చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో సహాయపడతాయి. దీనితో పాటు, ఇందులో ఇనుము కూడా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల మీ శరీరంలో ఎర్ర రక్త కణాలు కూడా తయారవుతాయి.

గుండె
పెసరపప్పులో పొటాషియం, ఐరన్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల మీ రక్తపోటు తగ్గుతుంది. ఎల్లో మూంగ్‌లో ఉండే ఫైబర్ మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చేస్తుంది. అంతేకాకుండా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

Also Read: Lady Finger: మీ డైట్‌లో బెండకాయ చేరిస్తే.. ఆ వ్యాధులకు చెక్... బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఫుడ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News