Diabetes Control Tips: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ అనగానే గుర్తొచ్చేవి అంజీర్. అంజీర్ క్రమం తప్పకుండా తినడం వల్ల మధుమేహం సమస్యను ఇట్టే దూరం చేయవచ్చు.
డ్రై ఫ్రూట్స్‌లో అంజీర్ స్థానం చాలా ప్రత్యేకమైంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ కావల్సినంతగా ఉంటాయి. నియమిత పద్ధతిలో తినడం వల్ల విటమిన్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం లభిస్తాయి. రోజుకు 2-3 అంజీర్ తింటే చాలు. శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. కడుపు నొప్పి, కిడ్నీలో రాళ్లు, లివర్ డిసీజ్, మైగ్రెయిన్ వంటి సమస్యలతో బాధపడేవాళ్లు మాత్రం అంజీర్ తినకూడదు.
అధిక బరువుతో బాధపడేవాళ్లు, బరువు తగ్గించుకోవాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ చాలా ప్రయోజనకరం. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ కారణంగా కడుపు నిండినట్టు ఉంటుంది. దాంతో ఆకలి పెద్దగా వేయదు. ఫలితంగా ఓవర్ ఈటింగ్ తగ్గడంతో బరువు నియంత్రణలో ఉంటుంది.
సీజన్ మారినప్పుడు చాలా రకాల వ్యాధులు ఎదురౌతుంటాయి. దీనికి కారణంగా ఇమ్యూనిటీ లోపించడమే. వైరల్ ఇన్‌ఫెక్షన్లు వంటివి తలెత్తుతాయి. ఇమ్యూనిటీ పెరగడం వల్ల సీజనర్ జ్వరాలు, జలుబు, దగ్గు వంటివి దూరమౌతాయి. రోజూ క్రమం తప్పకుండా అంజీర్ తినడం వల్ల రోగ నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఇందులో విటమిన్ సి, జింక్, మినరల్స్ కావల్సినంతగా లభిస్తాయి.
అన్నింటికీ మించి డయాబెటిస్ రోగులకు చాలా అద్భుతమైందని చెప్పవచ్చు. అంజీర్ గ్లైసెమిక్ ఇండెక్స్ 60 వరకూ ఉంటుంది. డయాబెటిస్ రోగులకు ఇది తప్పనిసరి. ఇందులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ వల్ల టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు చాలా మంచిది. మెటబోలిజంను పెంచుతుంది.
Also read: Dengue Fever: ఎక్కడ చూసినా డెంగ్యూ జ్వరాలే, డెంగ్యూ లక్షణాలేంటి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook