Dragon Fruit: రోజూ ఈ ఫ్రూట్ తింటే కేన్సర్ సహా అన్ని రోగాలు మాయం

Dragon Fruit: మనిషి ఎదుర్కొనే చాలా వ్యాధులకు పరిష్కారం ప్రకృతిలో లభించే వివిద రకాల పదార్ధాలు, పండ్లలోనే ఉన్నాయి. ఇందులో ముఖ్యమైంది డ్రాగన్ ఫ్రూట్. ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన ఫ్రూట్ ఇది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 5, 2023, 06:32 PM IST
Dragon Fruit: రోజూ ఈ ఫ్రూట్ తింటే కేన్సర్ సహా అన్ని రోగాలు మాయం

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అనేది వాస్తవానికి ఇండియన్స్‌కు పెద్దగా తెలియదు. కరోనా మహమ్మారి సమయం నుంచి బాగా ప్రాచుర్యం పొందింది. ప్రతి చోటా లభ్యమౌతోంది. అద్భుతమైన పోషకాలతో నిండి ఉండే డ్రాగన్ ఫ్రూట్ చాలా రకాల ప్రాణాంతక వ్యాధుల్నించి రక్షిస్తుందని చాలామందికి తెలియదు.

డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల్నించి కూడా రక్షించగదలదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో వివిధ రకాల విటమిన్లతో పాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్ వంటివి పెద్దమొత్తంలో ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ లో కొవ్వు లేకపోవడంతో గుండె ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. 

మరీ ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్‌లో కేన్సర్ తో పోరాడే సామర్ధ్యం కలిగిన ఫ్లెవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్. విటమిన్ సి వంటివి పెద్దమొత్తంలో ఉంటాయి. కేన్సర్ కారకాలుగా భావించే ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తాయి. కణాల డీఎన్ఏలో మార్పులకు కారణమై, కణాల్లో ఉత్పరివర్తనం ఉంటుంది. ఫలితంగా ఫ్రీ రాడికల్స్ తగ్గి కేన్సర్ ముప్పు తగ్గుతుంది. 

డ్రాగన్ ఫ్రూట్ తరచూ తినే అలవాటుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. స్నాక్స్ రూపంలో తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే నల్లని గింజల్లో ఒమేగా 3, ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్‌తో కొలెస్ట్రాల్ సైతం నియంత్రణలో ఉండటం వల్ల గుండెకు చాలా మంచిది. 

డ్రాగన్ ఫ్రూట్ తరచూ తీసుకోవడం వల్ల ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపడి రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా మధుమేహం అదుపులో ఉంటుంది. అన్నింటికంటే మించి డ్రాగన్ ఫ్రూట్ రోజూ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంటులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఇందుకు దోహదపడతాయి. 

Also read: Mouth Ulcers: చిటికెలో మౌత్ అల్సర్ సమస్యను తగ్గించే ఇంటి చిట్కాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News