Pista Benefits: హెల్తీ ఫుడ్స్‌లో పిస్తాను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇందులో దాదాపు అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఆధునిక జీవనశైలిలో తీనే వివిధ రకాల జంక్ ఫుడ్స్ స్థానంలో పిస్తాను చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. పిస్తా వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.
శరీరం ఆరోగ్యంగా ధృడంగా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ చాలా అవసరం. డ్రై ఫ్రూట్స్‌లో ముఖ్యంగా చెప్పుకోవల్సింది పిస్తా. రుచిలో కూడా అద్భుతంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా చాలా లాభదాయకం. పిస్తాను చాలామంది నేరుగా తినడానికే ఇష్టపడతారు. వివిధ రకాల వంటల్లో కూడా వినియోగిస్తుంటారు. లేదా కొన్ని వంటలపై గార్నిష్ చేసేందుకు ఉపయోగిస్తారు. ఆధునిక జీవన విధానంలో స్నాక్స్ రూపంలో చాలామంది చిప్స్, పాప్డీ, నూడిల్స్ వంటి అన్‌హెల్తీ ఫుడ్ తీసుకుంటుంటారు. స్నాక్స్ స్థానంలో పిస్తా అలవాటు చేసుకుంటే ఆరోగ్యపరంగా చాలా మంచిది.
రోజూ నిర్ణీత మోతాదులో క్రమం తప్పకుండా పిస్తా తినడం అలవాటు చేసుకుంటే రక్త నాళాల్లోపేరుకునే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫలితంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. హార్ట్ ఎటాక్ ముప్పు క్రమంగా తొలగిపోతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాడీ వీక్‌గా ఉండేవాళ్లు రోజూ పిస్తా తీసుకుంటే ఇందులో ఉండే ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాల కారణంగా ఎముకలకు బలం చేకూరుతుంది. బలహీనత దూరమౌతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ ముప్పు తగ్గుతుంది.
పిస్తాలో కేలరీలు ఎక్కువే ఉన్నా ఫైబర్, ప్రోటీన్లు కూడా అధికంగా ఉండటంతో బరువు తగ్గించే ప్రక్రియలో ఉపయోగపడుతుంది. ఎందుకంటే పిస్తా తిన్నప్పుడు త్వరగా ఆకలి అనేది వేయదు. ఫలితంగా ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది. పిస్తాలో డైటరీ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా బౌల్ మూమెంట్ మెరుగుపడటం ద్వారా మలబద్ధకం ముప్పు పోతుంది. ప్రేవులు ఆరోగ్యంగా ఉంటాయి. మొత్తానికి చూసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంటుంది.
ఇక పిస్తా కల్గించే ప్రయోజనాల్లో అతి ముఖ్యమైంది డయాబెటిస్ నియంత్రణ. మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా మంచిది. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. పిస్తా తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించుకోవచ్చు. అయితే రోజూ క్రమం తప్పకుండా పిస్తా తీసుకోవల్సి ఉంటుంది.
Also read: Cyclone Alert: బంగాళాఖాతంలో మరో భారీ తుపాను, ఏపీ తీరంవైపుకు దూసుకొచ్చే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook