Ayurvedic Tips: శరీరంలో గుండె తరువాత అతి ముఖ్యమైన అంగాల్లో లివర్, కిడ్నీలు ప్రధానమైనవి. కేవలం మనిషి ఆహారపు అలవాట్లు, జీవనశైలిని బట్టి ఇవి ఏ మేరకు ఆరోగ్యంగా ఉన్నాయి, ఎంతవరకూ సక్రమంగా పనిచేస్తున్నాయనేది ఉంటుంది. అంటే ఆహారపు అలవాట్లు సక్రమంగా లేకుంటే లివర్, కిడ్నీలు దెబ్బతినే అవకాశాలున్నాయి.
మనిషి శరీరం ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యల పరిష్కారానికి ఆయుర్వేదం అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మూలికలకు అంతటి శక్తి ఉంది. ముఖ్యంగా లివర్, కిడ్నీల పనితీరును మెరుగుపర్చడంలో మూలికలు కీలక పాత్ర పోషిస్తాయి. మూత్ర నాళాల్లో ఇన్‌ఫెక్షన్, మూత్రపిండాల్లో రాళ్లు, కిడ్నీ సంబంధిత వ్యాధుల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మీ అలవాట్లు సక్రమంగా ఉండాలి. లివర్, కిడ్నీల్ని ఆరోగ్యంగా ఉంచే ఆయుర్వేద ఔషధాల గురించి తెలుసుకుందాం..
దేశంలో దాదాపు ప్రతి కిచెన్‌లో తప్పకుండా కన్పించే పదార్ధమిది. కొత్తిమీరతో కిడ్నీ సంబంధిత వ్యాధులకు అద్భుతంగా చెక్ చెప్పవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. మూత్రాశయం పనితీరును మెరుగుపరుస్తుంది. అందుకే మీరు తినే డైట్‌లో కొత్తిమీరను భాగంగా చేసుకుంటే కిడ్నీల ఆరోగ్యానికి దోహదపడుతుంది.
ఇక రెండవది అల్లం. ఇది కూడా ప్రతి కిచెన్‌లో ఉండేదే. కిడ్నీలతో పాటు లివర్‌ను కూడా పూర్తిగా డీటాక్స్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కిడ్న నొప్పులు, స్వెల్లింగ్‌ను తగ్గిస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్ సమస్యను దూరం చేస్తాయి.
ఆయుర్వేదంలో చందనానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇటీవలి కాలంలో ఎక్కువగా కన్పిస్తున్న సమస్య యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్. ఈ సమస్యను పరిష్కరించేందుకు చందన పానీయం చాలా బాగా ఉపయోగపడనుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు యూటీఐ చికిత్స,లో దోహదపడతాయి.
తులసి గురించి అందరికీ తెలిసిందే. ఆధ్యాత్మికంగా ఈ మొక్కకు చాలా మహత్యముంది. అదే సమయంలో ఆయుర్వేదం ప్రకారం తులసి మొక్కను ఓ దివ్యౌషధంగా పరిగణిస్తారు. తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలోని విషపదార్ధాలను బయటకు పంపిస్తాయి. మెటబోలిజంను వేగవంతం చేస్తాయి. తులసి ఆకులు నమిలి తినవచ్చు లేదా తులసి నీళ్లు తాగవచ్చు. ఇక ఆయుర్వేదంలో అత్యధిక ప్రాధాన్యత కలిగిన మరో పదార్ధం త్రిఫలం. త్రిఫల అనేది ఆయుర్వే మూలికల కలయిక. అధిక బరువు నుంచి ఉపశమనం, మూత్ర పిండాల పనితీరు మెరుగుపర్చేందుకు దోహదపడుతుంది. లివర్ పనితీరు , సామర్ధ్యం పెరుగుతాయి.
Also read: Diwali Top Shares: ఈసారి దీపావళికి ఎలాంటి షేర్లు కొంటే మంచిది, టాప్ 10 షేర్లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook