Hiccups: తరచూ అదే పనిగా వెక్కిళ్లు వస్తున్నాయా, నిర్లక్ష్యం వద్దు, వెక్కిళ్లకు కారణాలేంటి

Hiccups: శరీరంలో జరిగే అంతర్గత మార్పులు లేదా సమస్యలు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. ఈ లక్షణాల్ని ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. లేకపోతే పెను సమస్యలకు దారి తీయవచ్చు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 18, 2023, 08:13 PM IST
Hiccups: తరచూ అదే పనిగా వెక్కిళ్లు వస్తున్నాయా, నిర్లక్ష్యం వద్దు, వెక్కిళ్లకు కారణాలేంటి

Hiccups: మనిషి ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఏదో ఒక సమస్య హఠాత్తుగా ఏర్పడి ఇబ్బంది పెడుతుంటుంది. ఇలాంటి సమస్యల్లో ఒకటి వెక్కిళ్లు. ఈ సమస్య ఎంత సాధారణంగా కన్పిస్తుందో అంత ప్రమాదకరం. కొందరికైతే ఏం చేసినా తగ్గదు. అదే పనిగా వెక్కిళ్లు వెంటాడుతూనే ఉంటాయి. అసలు వెక్కిళ్లు ఎందుకొస్తాయనేది ఇప్పుడు పరిశీలిద్దాం.

వెక్కిళ్లు అనేవి సహజంగా అందరికీ ఏదో ఒక సమయంలో ఎదురయ్యే సమస్యే. ఎవరికైనా ఎప్పుడైనా ఈ సమస్య ఉత్పన్నం కావచ్చు. గొంతు నుంచి ఆహారం దిగువకు దిగేటప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంటుంది. తినే ఆహారం నెగెటివ్ ప్రభావం పెరిగినప్పుడు ఈ సమస్య వస్తుంటుంది. ఊపిరితిత్తుల మధ్యలో గ్యాప్ లేనందువల్ల మన శ్వాస జాయింట్స్ కుదుపుతుంటుంది. అందుకే సాధారణంగా అంజీర్, నల్ల మిరియాలు, జాంకాయలు, సాఫ్ట్ డ్రింక్స్, మద్యం వంటివి తీసుకున్నప్పుడు ఎక్కువగా వెక్కిళ్లు వస్తుంటాయి. అంటే కొన్ని రకాల ఆహార పదార్ధాలు తిన్నప్పుడు వెంటనే వెక్కిళ్లు వస్తాయి. ఒకసారి వెక్కిళ్లు మొదలైతే వెంటనే ఆగవు. అదే పనిగా వస్తూ ఇబ్బంది పెడుతుంటాయి. అసలు వెక్కిళ్లకు కారణాలేంటో తెలుసుకుందాం..

వెక్కిళ్లు ఓ సాధారణ సమస్యే అయినా చాలా ఇబ్బంది పెడుతుంటుంది. చాలా అసౌకర్యంగా ఉంటుంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వెక్కిళ్లకు పరిష్కారముంది. వెక్కిళ్లు వస్తుంటే..హోమ్ రెమిడీస్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా తరచూ వెక్కిళ్లు వస్తుంటే ఉదయం వేళ కార్బొనేటెడ్ సోడా తాగితే మంచి ఫలితాలుంటాయి. సోడా అనేది వెక్కిళ్లను నియంత్రించడంలో దోహదపడుతుంది. 

వెక్కిళ్లు అనేవి అంతగా ప్రమాదకరం కావు. కానీ తీవ్ర అసౌకర్యం కల్గిస్తుంది. ఒకవేళ మీకు ఎక్కువ సమయం వెక్కిళ్లు బాధిస్తుంటే సహజంగానే శరీరం ఎక్కువ ఒత్తిడికి లోనవుతుంటుంది. ఇది  తీవ్రమైన సమస్యగా మారుతుంది. అందుకే వెక్కిళ్లు వచ్చినప్పుడు నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. అది కూడా శ్వాస పూర్తిగా పీలుస్తూ నీళ్లు తాగితే వెంటనే వెక్కిళ్లను నియంత్రించవచ్చు. శరీరంలో జరిగే కొన్ని అసౌకర్యాలు వెక్కిళ్ల రూపంలో బయటపడుతుంటాయి. చాలాకాలంగా వెక్కిళ్ల సమస్య వస్తుంటే తరచూ అదే పనిగా వెక్కిళ్లు వస్తుంటే మాత్రం వైద్య చికిత్స తీసుకోవడం ఉత్తమం. అప్పుడప్పుడూ ఈ సమస్య ఏర్పడితే మాత్రం హోమ్ రెమిడీస్ ద్వారా నియంత్రించవచ్చు.

Also read: Dental Care Tips: పళ్లలో కేవిటీ, చిగుళ్లలో రక్తం, నోటి దుర్వాసన బాధిస్తుంటే..ఇలా చేయండి చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News