Cervical Cancer: సర్వైకల్ కేన్సర్ అనేది సాధారణంగా 30 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన మహిళల్లో కన్పించే ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి నుంచి కాపాడుకునేందుకు కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలంటారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కొన్ని తప్పులు చేయకూడదంటారు.
ఈ ప్రాణాంతక వ్యాధి సెర్విక్స్‌లో వస్తుంటుంది. ఈ వ్యాధి ఎప్పుడు ఎవరికి ఎలా ఎదురౌతుందో తెలియని పరిస్థితి. అందుకే దీన్నించి కాపాడుకోవాలంటే అత్యుత్తమ మార్గం హెచ్‌పివీ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ సర్వైకల్, వెజైనల్, వల్వర్ కేన్సర్ల నుంచి రక్షిస్తుంది. ఈ వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు కొన్ని తప్పులు చేయకుండా దూరంగా ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం సర్వైకల్ కేన్సర్ అనేది మహిళలకు ఎదురయ్యే నాలుగవ ప్రాణాంతక కేన్సర్. ఇండియాలో ప్రతి యేటా 77,348 మంది మహిళలకు సైర్వైకల్ కేన్సర్ కారణంగా చనిపోతున్నారు. ప్రతియేటా 1,23,907 మందిఈ వ్యాధి బారిన పడుతున్నారు. అందుకే ఈ వ్యాధి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి. సర్వైకల్ కేన్సర్ ముప్పు దీనివల్ల పెరుగుతుంది. సిగరెట్ స్మోకింగ్ చేసే మహిళల్లో సర్వైకల్ కేన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఏ విధమైన రక్షణ లేకుండా లైంగిక చర్యల్లో పాల్గొనడం సైర్వైకల్ కేన్సర్ ముప్పును పెంచుతుంది. సర్వైకల్ కేన్సర్ ముప్పుని తగ్గించాలంటే ఈ జాగ్రత్తలు తప్పవు. ఎందుకంటే కండోమ్ వాడటం ద్వారా సెక్సువల్లీ ట్రాన్ మిట్టెడ్ వ్యాదుల ముప్పు ఉండదు.
ఎక్కువ మంది సంతానం కలిగిన మహిళలకు సర్వైకల్ కేన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇతర మహిళలతో పోలిస్తే వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఎక్కుమంది అంటే ఎంతమంది అనే విషయంపై స్పష్టత లేదు. దీర్ఘకాలంగా గర్భ నిరోధక మాత్రంలు తీసుకునేవారిలో సర్వైకల్ కేన్సర్ ముప్పు పెరిగిపోతుంది. ఓ అధ్యయనం ప్రకారం 5 ఏళ్ల వరకూ గర్భ నిరోధక మాత్రలు తీసుకునే మహిళల్లో సర్వైకల్ కేన్సర్ ముప్పు అధికంగా ఉంటుంది. అందుకే అవాంఛిత గర్భాన్ని తప్పించుకునే క్రమంగా పిల్స్ ఇష్టమొచ్చినట్టు వాడటం అంత మంచిది కాదు.
Also read: Cervical Cancer: గర్భాశయ క్యాన్సర్‌కు చికిత్స ఉందా..ఈ లక్షణాలు ఉంటే క్యాన్సర్ ఉన్నట్లేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook