High Blood Pressure: అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? ఇది కలిపిన నీటితో కేవలం వారం రోజుల్లో శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు..

Morning Drink For High Blood Pressure: అధిక రక్తపోటు కారణంగా చాలామంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీనికి తోడు బరువు కూడా పెరుగుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతిరోజు ఈ చిట్కాలు పాటించండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 26, 2023, 08:32 PM IST
High Blood Pressure: అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? ఇది కలిపిన నీటితో కేవలం వారం రోజుల్లో శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు..

 

Morning Drink For High Blood Pressure: చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆధునిక జీవన శైలిని అనుసరిస్తున్నారు. దీని కారణంగా దీర్ఘకాలిక వ్యాధులైన అధిక రక్తపోటు గుండెపోటు సమస్యల బారిన పడుతున్నారు. భారతదేశ వ్యాప్తంగా రక్త పోటు తో బాధపడుతున్న వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి. పూర్వం 60 సంవత్సరాల వయసు గల వారిలో వచ్చే అధిక రక్తపోటు ప్రస్తుతం ఆధునిక జీవనశైలి అనుసరించడం కారణంగా 20 సంవత్సరాల లోపు గల యువకులలో కూడా ఈ వ్యాధి వస్తోందని ఇటీవలే ఓ పరిశోధకుడు తెలిపారు.

ఆఫీసుల్లో ఒత్తిడి కారణంగా చిన్న వయసులోనే అధిక రక్తపోటు బారిన పడుతున్నారని పరిశోధనలో తేలింది. కొందరిలో అధిక రక్తపోటు కారణంగా గుండెపోటుతో పాటు మధుమేహం ఇతర ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం చాలామంది అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు మార్కెట్లో లభించే ఔషధాలను వినియోగిస్తున్నారు. అయితే వీటికి బదులుగా ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను వినియోగిస్తే సులభంగా అధిక రక్తపోటుకు చెక్ పెట్టొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read: Hyderabad Weather News: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పరిస్థితి ఇలా..

అధిక రక్తపోటు ఉన్నవారు ప్రతి రోజు రెండు గ్లాసుల చొప్పున ఉదయం సాయంత్రం నిమ్మరసం తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఆధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల వచ్చే కొలెస్ట్రాల్ కూడా సులభంగా కరిగిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల డిహైడ్రేషన్ సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుంది.

అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ప్రతిరోజు నిమ్మరసంలో దాల్చిన చెక్క పొడిని కలుపుకొని ఖాళీ కడుపుతో తాగడం వల్ల కూడా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు శరీర బరువును కూడా ప్రభావంతంగా నియంత్రిస్తాయని.. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఈ నీటిని తాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Hyderabad Weather News: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పరిస్థితి ఇలా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News