Home remedies for Burning Sensation in Stomach: సాధారణంగా అజీర్తి వల్ల కడుపు మంటగా ఉంటుంది. అయితే కొంతమందిలో కొన్ని అనారోగ్య ప్రాణాంతక సమస్యల వల్ల కూడా ఈ కడుపులో మంట అనేది ఉంటుంది మరికొంతమందికి తీసుకున్న ఆహారం పడకపోవడంతో ఇలా కడుపులో మంట సమస్య మొదలవుతుంది. అయితే ఇలా కడుపులో మంట తరచుగా వస్తూ ఉంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.కొంతమందికి కొన్న రకాల ఆహార పదార్థాలు అంటే డైరీ గ్లూటెన్, ఆల్కహాల్, ఫ్రైడ్ ఫుడ్స్, చాక్లెట్, సీట్రస్ వంటివి తినడం వల్ల కడుపులో మంట సమస్య మొదలవుతుంది ఇలాంటి వారికి కొన్ని ఆరోగ్య చిట్కాలతో ఎలా అధిగమించాలో తెలుసుకుందాం.
అల్లం..
అజీర్తితో బాధపడే వారికి అల్లం ఒక సహజ సిద్ధమైన రెమెడీ. ఇది కడుపులో యాసిడ్ లెవెల్స్ ని తగ్గిస్తుంది బర్నింగ్ సెన్సేషన్ నివారిస్తుంది అల్లం తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు రావు.
బేకింగ్ సోడా..
ఇది మన అందరి వంటగదిలో అందుబాటులో ఉండే కిచెన్ ఐటమ్. దీంతో కడుపు సంబంధిత సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా కడుపులో మంటగా ఉన్నప్పుడు బేకింగ్ సోడాను నీళ్లలో కలుపుకొని తాగాలి.
ఇది ఒక యాంటాసిడ్ లాగా పని చేస్తుంది. కడుపులో మంటను తక్షణమే రిలీఫ్ చేస్తుంది. అజీర్తితో బాధపడే వారికి బేకింగ్ సోడా ఒక బెస్ట్ రెమెడీ.
అరటిపండు..
అరటి పండులో యాంటాసీడ్స్ పుష్కలంగా ఉంటాయి. కడుపులో మంట సమస్యకు తక్షణ రెమిడీ. అరటిపండు తిన్న వెంటనే కడుపు ఉపశమనం కలుగుతుంది. ఈ రెమిడీ చాలా సులువు ఒక బ అరటిపండు తింటే కడుపు మంటకు చెక్ పెట్టొచ్చు.
ఎసెన్షియల్ ఆయిల్..
ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా కడుపు సమస్యలకు అధిగమిస్తాయి. ఇవి కడుపులో మంటను నివారిస్తాయి ఒక టాబ్లెట్ రూపంలో తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.
ఇదీ చదవండి: మష్రూమ్స్‌తో 6 ఆరోగ్య ప్రయోజనాలు.. బీపీ, అల్జీమర్స్ కూడా మీ దరిచేరవు..
పాలు..
కడుపు మంట సమస్యకు పాలు కూడా ఎఫెక్టివ్ రెమిడీ. పాలల్లో కాల్షియం లెవెల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపులో కడుపులో ఉన్న యాసిడ్‌ను సమతులను చేస్తాయి. దీంతో అజీర్తి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కడుపు సంబంధిత సమస్యలకు పాలు ఈజీ రెమిడి. చల్లని పాలను కాస్త చక్కెర వేసుకొని తాగితే ఆసిడ్ రిఫ్లెక్స్ నుంచి ఈ ఉపశమనం పొందుతారు.
సోంపు..
సోంపు యాంటీ పాస్ మోడిక్ హెర్బ్. అజీర్తి నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది. ప్రతిరోజు ఫుడ్ తీసుకున్న తర్వాత కాస్త సోంపు గింజలను నమలడం అలవాటు చేసుకోవాలి. ఇది మన పూర్వకాలం నుంచి వస్తున్న సంప్రదాయం గ్యాస్ట్రోన్ టెస్ట్ నియం ప్రాబ్లం నుంచి కాపాడుతుంది. అంతేకాదు కడుపునొప్పి కూడా ఉపశమనం కలిగిస్తుంది సోంపు.
ఇదీ చదవండి: మీ ఒంట్లో కొవ్వు ఎక్కువగా పేరుకుందా? ఈ ఒక్క డ్రింక్ తాగండి చాలు..
చూయింగ్ గమ్...
చూయింగ్ గమ్ కూడా ఆసిడ్ రిఫ్లెక్స్ కు సింపుల్ రెమెడీ. కడుపు సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు చూయింగ్ తీసుకోండి ఇలా కడుపు మంట సమస్య తరచుగా వస్తే మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్య నిపుణులను కచ్చితంగా సంప్రదించాలి ఇది ప్రాణాంతక ఆరోగ్య సమస్య కూడా ఒక లక్షణం కూడా కావచ్చు అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook