Mushroom Health Benefits: మష్రూమ్స్‌తో 6 ఆరోగ్య ప్రయోజనాలు.. బీపీ, అల్జీమర్స్‌ కూడా మీ దరిచేరవు..

Mushroom Health Benefits: కొంతమందికి మష్రూమ్స్ అంటే ఇష్టం వారి డైట్లో చేర్చుకుంటారు. మరికొందరికి మష్రూమ్స్ అంటే ఇష్టం ఉండదు. కానీ మన రెగ్యులర్ గా మన డైట్ లో మష్రూమ్ చేర్చుకోవడం వల్ల అయిదు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

Written by - Renuka Godugu | Last Updated : May 5, 2024, 01:45 PM IST
Mushroom Health Benefits: మష్రూమ్స్‌తో 6 ఆరోగ్య ప్రయోజనాలు.. బీపీ, అల్జీమర్స్‌ కూడా మీ దరిచేరవు..

Mushroom Health Benefits: కొంతమందికి మష్రూమ్స్ అంటే ఇష్టం వారి డైట్లో చేర్చుకుంటారు. మరికొందరికి మష్రూమ్స్ అంటే ఇష్టం ఉండదు. కానీ మన రెగ్యులర్ గా మన డైట్ లో మష్రూమ్ చేర్చుకోవడం వల్ల అయిదు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో మన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మష్రూమ్స్ రెండు మూడు రకాల కలర్ లో రకరకాల పరిమాణంలో అందుబాటులో ఉంటాయి.వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

బీపీ ..
మష్రూమ్స్ తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల బీపీ లెవెల్స్ తగ్గిపోతాయని వెబ్ ఎండి తెలిపింది. ఎందుకంటే మష్రూమ్స్ లో పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఖనిజాలు సోడియంకి వ్యతిరేకంగా పోరాడుతాయి రిలాక్స్ నరాలను కూడా రిలాక్స్‌ చేస్తాయి బిపి లెవెల్స్ తగ్గిపోతాయి. అంతేకాదు మష్రూమ్స్ లో సోడియం కూడా తక్కువ పరిణామంలో ఉంటుంది సాధారణంగా మష్రూమ్స్‌తో వివిధ రకాల రెసిపీలు తయారు చేసుకుంటారు ఈ సోడియం బిపి తో బాధపడే వారికి మష్రూమ్ కి బెస్ట్ రెమెడీ.

బూస్ట్ ఇమ్యూనిటీ..
మష్రూమ్స్ లో సెలీనియం, విటమిన్ డి, విటమిన్ b6 పుష్కలంగా ఉంటాయి. సెలీనియం సెల్ డామేజ్ కాకుండా నివారిస్తుంది విటమిన్ డి కణాల అభివృద్ధికి విటమిన్ b6 మన శరీరంలో ఎర్ర రక్త కణాలు అభివృద్ధికి సహాయపడుతుంది ఈ మూడు కలగలిపిన పోషకాలు మష్రూమ్స్ లో ఉంటాయి.

వెయిట్ లాస్..
మన ఆరోగ్యకరమైన డైట్ లో ఆరోగ్యకరమైన ఆహారాలు చేర్చుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఆంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండే ఆహారాలు చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. మష్రూమ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కణ వ్యవస్థను బలపరుస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్న మష్రూమ్స్ ఒబెసిటీ రాకుండా కూడా కాపాడుతుంది హైపర్ టెన్షన్ సమస్యలను తగ్గిస్తుంది.

ఇదీ చదవండి: భగభగమంటున్న భానుడు.. సన్‌ స్ట్రోక్‌ వచ్చిన వెంటనే ఆ వ్యక్తికి ఇలా చేయండి..

బ్రెయిన్ హెల్త్..
క్లెవర్ అండ్ క్లినిక్ ప్రకారం మష్రూమ్స్ బ్రెయిన్ అభివృద్ధికి సహాయపడతాయి. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు సమస్యకు చెక్కపడతాయి. మష్రూమ్స్ లో పాలిఫైనల్స్ అనే యాంటీ  ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇది న్యూరా సంబంధిత సమస్యలకు చెక్ పెడతాయి ఆల్జీమార్స్ పార్కిన్సన్‌ ఫ్యూచర్లో రాకుండా మష్రూమ్స్ సహాయపడతాయి.

ఇదీ చదవండి: రాత్రి మొత్తం ఏసీ ఆన్ లోనే ఉంచుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

గుండె ఆరోగ్యం..
సాధారణంగా ఈ మష్రూమ్స్ ప్లాంట్ బెస్ట్ కాబట్టి ఇవి రక్తనాళాలను అభివృద్ధి చేస్తాయి గుండె సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తాయి.

పేగు ఆరోగ్యం..
మష్రూమ్ తరచుగా తీసుకోవడం వల్ల మన పేగు ఆరోగ్యం బాగుంటుంది ఎందుకంటే ఇందులో మంచి బ్యాక్టిరియా పెరుగుదలకు తోడ్పడుతుంది. పేగు కదలికలకు సహాయపడుతుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News