Jaggery Benefits: ఎనీమియా సమస్యతో బాధపడుతున్నారా, అమ్మమ్మల కాలం నాటి అద్భుత చిట్కా

Jaggery Benefits: ఇటీవలి కాలంలో రక్త హీనత లేదా హిమోగ్లోబిన్ తగ్గడం ప్రధాన సమస్యగా మారింది. చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎనీమియా సమస్య వెంటాడుతోంది. ఎనీమియా అనేది దినచర్యపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. మరి ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 23, 2024, 05:09 PM IST
Jaggery Benefits: ఎనీమియా సమస్యతో బాధపడుతున్నారా, అమ్మమ్మల కాలం నాటి అద్భుత చిట్కా

Jaggery Benefits: శరీరంలో వివిధ అవయవాల పని తీరు సక్రమంగా ఉండాలంటే రక్తం చాలా అవసరం. అందుకే రక్తం అనేది తగిన పరిమాణంలో ఉండాలి. ఎనీమియా  అంటే తగినంత పరిమాణంలో రక్తం ఉత్పత్తి కాకపోవడమే. ఇది ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే మార్కెట్ లో లభించే ఓ స్వీట్ వస్తువుతో ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. అదేంటో తెలుసుకుందాం.

ఎనీమియా సమస్యకు అద్భుతమైన పరిష్కారం బెల్లం. రాత్రి వేళ భోజనం చేశాక కొద్దిగా బెల్లం తినమని పెద్దలు చెప్పడం వినే ఉంటారు. ఇదేదో అలవోకగా చెప్పింది కాదు. దీని వెనుక మర్మమదే. బెల్లం తీపి పదార్ధమైనా అత్యంత హెల్తీ ఫుడ్. ఆరోగ్యానికి బెల్లం చాలా మంచిది. రోజూ రాత్రి వేళ బెల్లం తినడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తొలగిపోతుంది. ఎనీమియాతో బాధపడేవాళ్లు బెల్లం క్రమం తప్పకుండా తింటే ఐరన్ లోపం పోతుంది. ఇందులో ఉండే ఇతర పోషకాల కారణంగా శరీరంలో రక్తం ఉత్పత్తి మెరుగుపడుతుంది

టీనేజ్ నుంచి యువకుల వరకూ అందరికీ పింపుల్స్ సమస్య వేధిస్తుంటుంది. దీనివల్ల ముఖం అందంపై ప్రతి కూల ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో బెల్లం తగిన పరిమాణంలో రోజూ తీసుకుంటే పింపుల్స్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.అన్నింటికంటే ముఖ్యంగా బరువు నియంత్రణలో కూడా బెల్లం ఉపయోగపడుతుంది. పంచదార తింటే బరువు పెరుగుతారు. కానీ బెల్లం తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. 

వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్ల కారణంగా కడుపు సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటుంటాయి. ఈ పరిస్థితుల్లో రాత్రి వేళ బెల్లం కొద్దిగా తినడం అలవాటు చేసుకుంటే చాలా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ఇది అమ్మమ్మల కాలం నాటి చిట్కా. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. 

Also read: Union Budget 2024 Updates: ట్యాక్స్ పేయర్లకు స్వల్ప ఊరట, కొత్తగా మారిన ఇన్ కంటాక్స్ స్లాబ్ విధానం ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News