Knee Joint Pain: మారుతున్న సీజన్ కారణంగా చాలా మందిలో జ్వరంతో పాటు జలుబు వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. జ్వరం నుంచి కోలుకున్న తర్వాత ప్రస్తుతం చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు తప్పకుండా ఆయుర్వేద గుణాలు కలిగిన నూనెలను వినియోగించాల్సి ఉంటుంది. వాటిని వినియోగించడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గడమేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
వీటితో కీళ్ల నొప్పులకు చెక్:
పసుపు:
పసుపు కూడా కీళ్ల నొప్పులను ప్రభావవంతంగా తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి తీవ్ర కీళ్ల నొప్పులు, వాపు సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు గ్లాసు పాలలో పసుపును వేసి మరిగించి తాగడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఈ రెండు మిశ్రమాలను పేస్ట్‌లా తయారు చేసి నొప్పులున్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.
Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం
ఆవాల నూనె:
యాంటీ ఇన్‌ఫ్లమేటరీలు మస్టర్డ్ ఆయిల్‌లో అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి కీళ్ల నొప్పులను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. తీవ్ర కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు ఆవాల నూనెను ఓ బౌల్ వేడి చేసి అందులో వెల్లుల్లి రెబ్బలను వేసి నొప్పి ప్రభావితం ఉన్న చోట అప్లై చేసి మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా మీకు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
అల్లం:
అల్లం కూడా తీవ్ర కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు కండరాల నొప్పిని తగ్గించడమేకాకుండా తీవ్ర కీళ్ల నొప్పులను నియంత్రిస్తుంది. కాబట్టి నీటిలో అల్లాన్ని వేసి బాగా మరిగించి తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook